Education

ఏపీలో అంగన్‌వాడీ పోస్టుల భర్తీ.. కేవలం పదో తరగతి అర్హత.. వెంటనే దరఖాస్తు చేసుకోండి

Gokavarapu siva
Gokavarapu siva

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. ఆంధ్రప్రదేశ్ లో ఉన్న అంగన్వాడీ పోస్టుల భర్తీ కొరకు ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. భర్తీకి ఈ పోస్టుల ఖాళీలు కడప మరియు విజయనగరం జిల్లాల్లో ఉన్నట్లు తెలిపారు. కేవలం పదో తరగతిలో ఉత్తీర్ణత సాధించిన వారు కూడా ఈ ఉంద్యోగాలకు అర్హులే. అర్హులు మరియు ఆసక్తి ఉన్నవారందరూ వెంటనే దరఖాస్తు చేసుకోండి.

కడప జిల్లాకు చెందిన ఐసీడీఎస్ ప్రాజెక్టుల్లోని అంగన్‌వాడీ కేంద్రాల్లో అంగన్‌వాడీ వర్కర్, అంగన్‌వాడీ హెల్పర్ పోస్టుల ఖాళీలను భర్తీ కొరకు ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టులను మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ భర్తీ చేస్తుంది. మొత్తానికి కడప జిల్లాలో భర్తీకి 71 ఖాళీలు మరియు విజయనగరం జిల్లాలో 78 ఖాళీలు ఉన్నట్లు నోటిఫికేషన్ లో తెలిపారు.

కడప జిల్లా
కడప జిల్లాలో మొత్తానికి 71 పోస్టుల ఖాళీలు ఉన్నాయి. వీటిలో అంగన్ వాడీ వర్కర్ విభాగంలో 18 పోస్టులు, అంగన్ వాడీ హెల్పర్ విభాగంలో 49 పోస్టులు మరియు మినీ అంగన్ వాడీ వర్కర్ విభాగంలో 4 పోస్టులు భర్తీకి ఖాళీలు ఉన్నట్లు అధికారులు తెలిపారు.

విజయనగరం జిల్లా
విజయనగరం జిల్లాల్లో మొత్తానికి 78 పోస్టుల ఖాళీలు ఉన్నాయి. వీటిలో అంగన్ వాడీ వర్కర్ విభాగంలో 10, అంగన్ వాడీ హెల్పర్ విభాగంలో 53 పోస్టులు మరియు మినీ అంగన్ వాడీ వర్కర్ విభాగంలో 15 పోస్టులు భర్తీకి ఖాళీలు ఉన్నట్లు అధికారులు తెలిపారు.

ఇది కూడా చదవండి..

విద్యుత్ వినియోగదారులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త!

ఈ ఉద్యోగాలకు విద్యార్హత వచ్చేసి, అంగన్ వాడీ వర్కర్ ఉద్యోగాల కొరకు పదో తరగతి మరియు మిగిలిన పోస్టులకు 7వ తరగతి పాసై ఉండాలని నోటిఫికేషన్ లో తెలిపారు. అభ్యర్థుల వయసు జులై 1,2022 నాటికి 21 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలని అధికారులు సూచించారు.

ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారికి నెలకు వేతనం వచ్చేసి అంగన్ వాడీ వర్కర్ ఉద్యోగాలకు రూ.11,500, మినీ అంగన్ వాడీ వర్కర్ కు రూ.7 వేలు మరియు అంగన్ వాడీ హెల్పర్ ఉద్యోగాలకు ఎంపికైన వారికి నెలకు రూ.7 వేల వేతనం ఉంటుందని ప్రకటనలో తెలిపారు. ఈ ఉద్యోగాలకు ఆశక్తి ఉన్నవారు ఆఫ్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. తమ దరఖాస్తులను వైఎస్సార్ కడప జిల్లాలోని సీడీపీఓ కార్యాలయం అడ్రస్ కు అభ్యర్థులు పంపించాలి.

ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి ఈ నెల అనగా మార్చి 27ని చివరి తేదీగా నిర్ణయించారు. అభ్యర్థులను ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. అభ్యర్థులకు మార్చి 28వ తేదీన * ఇంటర్వ్యూలను నిర్వహిస్తారు.

ఇది కూడా చదవండి..

విద్యుత్ వినియోగదారులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త!

Share your comments

Subscribe Magazine