Health & Lifestyle

ఉగాది పచ్చడిలో ఉండే పోషకాలు ఏమిటో మీకు తెలుసా?

KJ Staff
KJ Staff
Image Credits: Swathi's recipies
Image Credits: Swathi's recipies

మన తెలుగువారు ఎంతో ప్రత్యేకంగా జరుపుకునే పండగలో ఉగాది ఒకటి. తెలుగు క్యాలెండర్ ప్రకారం ఉగాదిని నూతన సంవత్సరంగా. పాశ్చ్యాత కొత్త సంవత్సరం లాగా తాగి చిందులు వెయ్యకుండా, సాంప్రదాయ బద్దంగా ఉగాది పచ్చడితో మరియు పిండి వంటలతో కుటుంబం తో కలసి తెలుగు నూతనాదీని ప్రారంభిస్తాం. మన పెద్దలు ఉగాదికి కచ్చితంగా ఉగాది పచ్చడి చేసుకుని తినే కట్టుబాటు పెట్టారు. అయితే ఉగాది పచ్చడి తినడం ద్వారా మన శరీరానికి లభించే పోషక విలువలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

ఉగాది పచ్చడి షడ్రుచుల కలయిక. ఆరు రుచులు కలిగిన ఉగాది పచ్చడి తయారీలో వినియోగించే అన్ని పదార్ధాల్లో మన శరీరానికి అవసరమయ్యే ఎన్నో పోషకాలు దాగి ఉన్నాయి.

పులుపు కోసం మామిడి:

ఉగాది పచ్చడిలో ముఖ్య పదార్ధమైన మామిడిలో విటమిన్-ఏ,సి, బి6 వంటి విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి శారీరం రోగాలకు తట్టుకునేందుకు రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. మామిడిలో ఫైబర్ అధికంగా ఉంటుంది కనుక ఆహరం సజావుగా జీర్ణం కావడానికి తోడ్పడుతుంది. ఉగాది నుండి మార్కెట్లో మామిడి పళ్ళు లభ్యత పెరుగుతుంది.

చేదు కోసం వేప పువ్వు:

వేప పువ్వుల్లో మనకు తెలియని ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. వేప పూత ప్రయోజనాలు తెల్సుకున్న కొన్ని దేశాలు వాటిని అనేక రకాల వంటకాల్లో వినియోగిస్తున్నారు. వేప పువ్వు యాంటిసెప్టిక్ గా పనిచేసి మన శరీరంలోని మలినాల్ని నిర్ములిస్తుంది. లివర్ ఆరోగ్యాన్ని కాపాడంటంలో వేప పువ్వు ఎంతో సహాయపడుతుంది. చాల మంది వేప పువ్వును కూరల్లోనూ చుట్నీల్లోనూ, షర్బత్ లోను వాడుతుంతారు. దీని ప్రయోజనం తెలిసిన మన పూర్వికులు ముందు చూపుతో వేప పువ్వును మన ఆహారంలో చేర్చడం గర్వించతగ్గ విష్యం.

తీపి కోసం బెల్లం:

కావాలంటే తీపి కోసం మనం చెక్కెర కూడా వాడవచ్చు కానీ బెల్లనే ఎందుకు వాడతామంటే బెల్లం శరీరంలో షుగర్ లెవెల్స్ పెరగనియ్యదు. ఎముకల దృఢంగా తయారుకావడానికి కాల్షియమ్ అవసరం, బెల్లంలో కాల్షియమ్ పుష్కలంగా లభిస్తుంది. మరొక్క విశేషం ఏమిటంటే బెల్లం అసిడిటీ ని తగ్గిస్తుంది,మరియు మలబద్దకాన్ని తరిమికొడుతుంది అందుకే భోజనం చేసిన తర్వాత బెల్లం ముక్క తినమంటారు. బెల్లంలో ఉండే జింక్ రోగ నిరోధక శక్తిని పెంచుతుంది.

వగరు కోసం చింతపండు:

మన తెలుగు వారి వంటల్లో చింతపండును ప్రతి రోజు వాడుతూనే ఉంటాం. శరీరంలో బ్లడ్ ప్రెషర్ అదుపులో ఉండటానికి, పొటాషియం చాల అవసరం, చింతపండులు మన శరీరానికి అవసరమయ్యే పొటాషియం పుష్కలంగా లభిస్తుంది. అంతే కాకుండా కొలెస్ట్రాల్ లెవెల్స్, నియంత్రించి హార్ట్ అటాక్స్ రాకుండా ఆపడంలో చింతపండు దోహదపడుతుంది.

ఉప్పాదనం కోసం ఉప్పు:

కొంత మంది ఉప్పులేని వంటలు తినడం ద్వారా మన ఆరోగ్యం మెరుగుపడుతుందని, సూచనలు ఇస్తారు, కానీ వరల్డ్ హెల్త్ ఆర్గనైజషన్ ప్రకారం ప్రతి రోజు 2000 మిల్లీగ్రాముల ఉప్పు తీసుకోవాలి. ఉప్పు మన శరీరానికి అవసరమైన సోడియం అందిస్తుంది, సోడియం కిడ్నీల పనితీరులో కీలక పాత్ర పోషిస్తుంది. కానీ అధికంగా ఉప్పు తినడం ద్వారా కొన్ని దుష్ప్రభావాలను ఎదురుకోవాలి.

గాటు కోసం కారం:

ఉగాది పచ్చడిలో ఘాటు కోసం, పచ్చిమిర్చి లేదా కారాన్ని వాడచ్చు. పచ్చిమిర్చిలో విటమిన్- ఏ, సి, ఇవి రోగ నిరోధక శక్తీ పెంచడంలో సహాయపడతాయి. కొన్ని అధ్యయనాలు ప్రకారం పచ్చిమిర్చి గుండె జబ్బులు రాకుండా నియంత్రిస్తుందని వెల్లడించారు.

ఇలా ఉగాది పచ్చడిలో ఆరు రుచుల కోసం ఉపయోగించే ఆరు పదార్దాలలో అనేక ప్రయోజనాలు ఉంటాయి. పరిజ్ఞానం అభివృద్ధి చెందిన తర్వాత మనం వీటిని కనిపెట్టాం, కానీ కొన్ని వందల సంవత్సరాల ముందే ఈ ఆరోగ్య ప్రయోజనాలను కనిపెట్టి వాటిని మన ఆహారంలో చేర్చిన మన పూర్వీకుల ముందు చూపుకి, వారి విజ్ఞానానికి మనం ఎల్లపుడు గర్వపడాలి.

Share your comments

Subscribe Magazine

More on Health & Lifestyle

More