Health & Lifestyle

ఏమిటి క్యాబేజీతో షుగర్ వ్యాధికి చెక్ పెట్టచ్చా?

KJ Staff
KJ Staff

ఈ మధ్య కాలంలో షుగర్ వ్యాధి సర్వసాధారణమైపోయింది. పెద్ద వారు చిన్న పిల్లలు ఇలా వయసుతో పని లేకుండా ప్రతి ఒక్కరిని షుగర్ వ్యాధి బాధిస్తుంది. మరొక్క దురదృష్టకరమైన విష్యం ఏమిటంటే అప్పుడే పుట్టిన పసి పిల్లల్లో కూడా షుగర్ వ్యాధి రావడం, దీనినే జ్యువినైల్ దియాబెటిస్ అంటారు. షుగర్ వ్యాధితో జీవితం కొనసాగించడం ఆశామాషి విషయం కాదు. ప్రతిరోజూ తీసుకునే ఆహారంలో ఎంతో శ్రద్ధ పాటించవలసి ఉంటుంది. షుగర్ కంట్రోల్లో ఉంచుకోవడానికి ఆహారంలో కొన్ని మార్పులు చేయడం ద్వారా మంచి ఫలితాలు పొందవచ్చు.

ప్రకృతి ఒక వైద్యశాల వంటిది, మనకు ఏర్పడే ఎన్నో ఆరోగ్య సమస్యలకు ప్రకృతిలో సమాధానం ఉంది. మనం రోజు తినే పళ్ళు కూరగాయల్లో శారీరానికి అవసరమయ్యే విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా లభిస్తాయి. అటువంటి బహుప్రయోజనాలు ఉన్న కాయగూరల్లో క్యాబేజి ఒకటి. ఆహారంలో క్యాబేజీ చేర్చుకోవడం ద్వారా మంచి ఆరోగ్య ప్రయోయోజనాలు పొందవచ్చని నిపుణులకు సూచిస్తున్నారు. ముఖ్యంగా షుగర్ వ్యాధిగ్రస్థులు తమ రోజువారీ ఆహారంలో క్యాబేజీని ఒక భాగం చేసుకున్నప్పుడు జరిగే మార్పులు గమనించవచ్చిని నిపుణులు సూచిస్తున్నారు. క్యాబేజీలో ఉండే యాంటీఆక్సిడెంట్లు, యాంటీఇన్ఫ్లమ్మెటరీ లక్షణాల నుండి కాపాడి రాగాల నుండి మనల్ని రక్షిస్తుంది. క్యాబేజీలో లభ్యమయ్యే ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరచి, మలబద్దకం నుండి కాపాడుతుంది.

షుగర్ వ్యాధి నుండి కాపాడుతుంది:

షుగర్ వ్యాధి గ్రస్తుల్లో శరీరంలోని ప్యాంక్రియాస్ అనే అవయవం ఇన్సులిన్ అనే హార్మోన్ విడుదల చెయ్యదు. ఇన్సులిన్ రక్తంలోని గ్లూకోస్ కణాల్లో కలిసిపోయేలా చేస్తుంది. షుగర్ వ్యాధి గ్రస్తుల్లో ఇన్సులిన్ విడుదల కాకా రక్తంలోని గ్లూకోస్ లెవెల్స్ భారీగా పెరిగిపోతాయి క్యాబేజీలో లభ్యమయ్యే యాంటీ- హైపర్గ్లుసిమిక్ లక్షణాలు ద్వారా రక్తంలో షుగర్ లెవెల్స్ నియంత్రించడానికి తోడ్పడతాయి. తరచు క్యాబేజీ తీసుకోవడం ద్వారా షుగర్ లెవెల్స్ కంట్రోల్ ఉండటమే కాకుండా శరీరం అధిక చక్కర శాతాన్ని తట్టుకునే సామర్ధ్యం లభిస్తుంది.

ఇతర ప్రయోజనాలు:

అధిక పోషక విలువలు కలిగిన క్యాబేజీలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ముందుగా క్యాబేజీలో లభ్యమయ్యే అధిక ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరచి, తీసుకున్న ఆహరం సరిగ్గా జీర్ణమై మలబద్దకాన్ని తగ్గిస్తుంది. గ్యాస్ అసిడిటీ సమస్యలు ఉన్నవారుకూడా క్యాబేజీని ఆహారంలో చేర్చుకోవడం ద్వారా ఈ సమస్యల నుండి దూరంచేసుకోవచ్చు. డైటింగ్ చేసేవారికి క్యాబేజి ఒక చకట్టి ఆహరం. క్యాబేజీలో తక్కువ ఉండటం మరియు శరీరంలో పేరుకుపోయిన కొవ్వును తొలగించడం ద్వారా బరువును నియంత్రించంలో తోడ్పడుతుంది. అంతేకాకుండా క్యాబిజిలో దొరికే సహజసిద్ధమైం యాంటీఆక్సిడాంట్లు, మరియు విటమిన్లు శరీరంలో రోగనిరోధక శక్తిని పెంపొందించడంలో సహాయం చేస్తాయి.

ఈ మొత్తం సమాచారం ఇంటర్నెట్ నుండి సేకరించబడింది. వినియోగదారులు వీటిని వాడేముందు, ఇవి మీ శరీర తత్వానికి అనువైనవో కావో తెలుసుకుని వినియోగించడం శ్రేయస్కరం-కృషి జాగరణ్.

Share your comments

Subscribe Magazine