Health & Lifestyle

బెల్లం ఎక్కువగా తింటున్నారా.. అయితే జాగ్రత్త ఈ సమస్యలు వచ్చే అవకాశం ఉంది!

Gokavarapu siva
Gokavarapu siva

సాధారణంగా చక్కెరతో పోలిస్తే బెల్లం ఆరోగ్యానికి ఎంతో ఉపయోగకరమని మనకు తెలిసిందే. బెల్లంలో పోషకాలు అధికంగా ఉండటం చేత ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు చేకూరుతాయని భావిస్తారు. ఈక్రమంలోనే రక్తహీనత సమస్యతో బాధపడే వారికి బెల్లం అద్భుతమైన పరిష్కార మార్గం అని చెప్పవచ్చు.

బెల్లం లో ఐరన్ సమృద్ధిగా ఉండటం వల్ల మన శరీరంలో రక్తం అభివృద్ధి చెందడానికి బెల్లం దోహదపడుతుంది.అయితే అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని అధిక మొత్తంలో బెల్లం తీసుకోవడం వల్ల అనేక సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మరి బెల్లం తినడం వల్ల ఏ విధమైనటువంటి అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి ఇక్కడ తెలుసుకుందాం.

అధిక శరీర బరువుతో బాధపడేవారు బెల్లం తీసుకోకూడదు. అధిక మొత్తంలో బెల్లం తీసుకోవడం వల్ల శరీర బరువు అమాంతం పెరుగుతుంది. నిజానికి బెల్లంలో పిండి పదార్థాలు చక్కెర అధికంగా ఉండటం వల్ల శరీర బరువు పెరగడానికి దోహదం చేస్తుంది. బెల్లానికి వేడి చేసే గుణం ఉండటం కారణంగా ఏ కాలంలో అయినా కానీ బెల్లం పరిమితంగా తీసుకోవడం ఎంతో ఉత్తమం. ముఖ్యంగా వేసవి కాలంలో బెల్లం ఎక్కువగా తీసుకోవడం వల్ల ముక్కు నుంచి రక్తస్రావం జరుగుతుంది.

ఇది కూడా చదవండి..

ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం.. ఏపీ పోలీస్ అలవెన్స్ ల్లో కోతలు విధిస్తూ జీవో విడుదల

బెల్లంలో సుక్రోజ్ ఉండటం వల్ల అధిక పరిమాణంలో బెల్లం తీసుకోవడం వల్ల మన శరీరంలో రక్తంలోని చక్కెర స్థాయిలు కూడా పెరుగుతాయి. చాలామంది మధుమేహంతో బాధపడేవారు చక్కెరకు బదులు బెల్లం ఉపయోగిస్తుంటారు. వీలైనంతవరకు బెల్లం తక్కువగా తీసుకోవటం ఉత్తమం.

బెల్లంలో చక్కెర అధికంగా ఉండటం వల్ల కొన్నిసార్లు కడుపులో మంట కడుపు ఉబ్బరం వంటి సమస్యలు తలెత్తే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా కీళ్ల నొప్పులతో బాధపడేవారు బెల్లం తక్కువ పరిమాణంలో తీసుకోవటం మంచిది.

ఇది కూడా చదవండి..

ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం.. ఏపీ పోలీస్ అలవెన్స్ ల్లో కోతలు విధిస్తూ జీవో విడుదల

Related Topics

jaggery problems

Share your comments

Subscribe Magazine