Health & Lifestyle

మేడిపండ్లతో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో మీకు తెలుసా!

Gokavarapu siva
Gokavarapu siva

మనం ఎటువంటి ఆరోగ్య సమస్యలకు లోనవకుండా ఉండాలి అంటే మనం మంచి పోషకాలు ఉన్న ఆహరం తీసుకోవాలి. దానితోపాటు ఫైబర్, మినరల్స్, విటమిన్లు వంటి పోషకాలు ఉండే పండ్లను కూడా మన ఆహారంలో భాగం చేసుకోవాలి. అన్ని రకాల పోషకాలు ఉన్న ఆహారాన్ని తీసుకుంటే ఎటువంటి ఆరోగ్య సమస్యలు మన దారికి చేరవని నిపుణులు అంటున్నారు. ఇలాంటి అన్ని రకాల పోషకాలు కలిగి ఉన్న పండ్లలో మేడిపండు కూడా ఒకటి.

ఈ మేడిపండుని అంజీర్, ఫిగ్ అని కూడా పిలుస్తారు. ఈ మేడిపండుని తినడం వలన మనకి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఈ మేడిపండుని నీటిలో నానబెట్టి, ప్రతి రోజు ఉదయం పరగడుపునే 3, 4 తింటే మనకు వెంటనే శక్తీ వస్తుంది. మరియు దీనితో పాటు వివిధ రకాల ఆరోగ్య సమస్యలు కూడా తగ్గుతాయి. దీని వాళ్ళ మనకి ఎటువంటి ప్రయోజనాలు ఉన్నాయో తెలుసుకుందాం.

ఈ మేడిపండులో ఎక్కువగా పొటాషియం, ఒమెగా 3, 6 ఫ్యాటీ యాసిడ్స్ అనేవి లభిస్తాయి. ఇవి మన శరీర రాష్టంలో గ్లూకోస్ స్థాయిని నియంత్రిస్తుంది. కాబట్టి ప్రతి రోజు దీనిని మధునేహంతో బాధ పడేవారు తింటే వారికి ఈ సమస్య తగ్గుతుంది.

ఈ మేడిపండులో ఎక్కువగా పీచు పదార్ధాలు కూడా ఉంటాయి. వీటిని మన రోజు ఆహారంలో తీసుకోవడం వలన ఇది మన జీర్ణ వ్యవస్థను మెరుగుపరచడంలో సహాయపడుతుంది దానితో పాటు మలబద్ధకం సమస్య కూడా దూరమవుతుంది. మలబద్ధక సమస్యను తగ్గించడంలో ఈ మేడిపండు చాలా బాగా పనిచేస్తుంది.

ఇది కూడా చదవండి..

వ్యాయామం లేకుండా బరువు తగ్గాలనుకుంటున్నారా..ఈ చిట్కాలు పాటించండి.

మన రోజుకి కావలసిన కాల్షియమ్ అనేది మనకు ఈ మేడిపండులో దొరుకుతుంది. కాబట్టి దేనికి ప్రతిరోజు పిల్లలకు ఆహారంగా పెట్టడం వలన వారి యొక్క ఎముకలు దృడంగా తయారవుతాయి. కాబట్టి ఇది చిన్నపిల్లలు, పెద్దవారు మరియు మహిళలు తీసుకోవడం చాల ముఖ్యం.

ఈ మేడిపండు ముఖ్యంగా మన శరీర బరువు తగ్గడానికి ఉపయోగపడుతుంది. అంజీరాలు జీర్ణం అయ్యేందుకు చాలా సమయం తీసుకుంటుంది. కాబట్టి ఇది తీసుకుంటే అంత త్వరగా ఆకలి వేయదు.

మేడిపండును తినడం వలన మన రక్తంలో ఉండే చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది. చెడు కొలెస్ట్రాల్ పెరిగితే రక్త నాళాలు మూసుకుపోయి గుండె పోటు వస్తుందని తెలిసిందే. దీనిని ప్రతిరోజు మనం తినడం వలన మనకు ఈ గుండె సంబంధించిన సమస్య తగ్గుతుంది. ఎందుకంటే ఫిసిన్ అనే డైజెస్టివ్ ఎంజైమ్ అంజీర్‌ పండులో లభిస్తుంది. ఇది ఆహారాన్ని త్వరగా జీర్ణం చేయడానికి సహాయపడుతుంది.

ఇది కూడా చదవండి..

వ్యాయామం లేకుండా బరువు తగ్గాలనుకుంటున్నారా..ఈ చిట్కాలు పాటించండి.

Related Topics

fig health benefits

Share your comments

Subscribe Magazine