Health & Lifestyle

బిర్యానీ ఆకుల వల్ల ఎన్ని ప్రయోజనాలో తెలుసా..?

KJ Staff
KJ Staff

సాధారణంగా బిర్యానీ ఆకులను చికెన్, మటన్ బిర్యానీల్లో రుచికోసం వాసన కోసం ఎక్కువగా
ఉపయోగిస్తారన్న విషయం తెలిసిందే.అయితే ఈ మధ్య కాలంలో బాగా ప్రాచుర్యం పొందిన రుచికరమైన, సువాసనగల బిర్యానీ ఆకుల టీ ప్రతి రోజూ తాగడం వల్ల మన శరీరంలో వ్యాధి నిరోధక శక్తిని పెంచి సీజనల్ వ్యాధులతో పాటు అనేక రకాల వ్యాధుల నుంచి మనకు రక్షణ కల్పిస్తుంది.

బిర్యానీ ఆకుల్లో సహజంగా ఉన్నటువంటి యాంటీబ్యాక్టీరియల్, యాంటీ వైరల్,యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ప్రమాదకర బ్యాక్టీరియా వైరస్ వల్ల వచ్చే ఫ్లూ, శ్వాసకోశ వ్యాధులు, గొంతు నొప్పి సమస్యలను దూరం చేస్తుంది. అలాగే ఇందులో ఉన్నటువంటి యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు సాధారణ కీళ్లనొప్పులతో పాటు ఆర్థరైటిస్,రుమటాయిడ్ వంటి దీర్ఘకాల వ్యాధులను అదుపులో ఉంచడంలో సహాయపడుతుంది. బిర్యానీ ఆకుల్లో ఫైటో న్యూట్రియెంట్స్ ఉండడంవల్ల వీటిని ప్రతిరోజు కషాయంగా తీసుకుంటే మన శరీరంలోని క్యాన్సర్ కారకాలతో సమర్థవంతంగా పోరాడతాయి.

ప్రతిరోజు క్రమం తప్పకుండా బిర్యానీ ఆకుల టీ తాగడం వల్ల చెడు కొలెస్ట్రాల్ నీ,అధిక కేలరీలని త్వరగా కరిగించి గుండె పనితీరును మెరుగుపరుస్తుంది.అలాగే అతి బరువు, ఊబకాయం వంటి సమస్యలకు దూరంగా ఉండవచ్చు. రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను నియంత్రించి చక్కెర వ్యాధిని అదుపులో ఉంచుతుంది. రుచికరమైన బిర్యాని ఆకుల టీని తయారు చేసుకోవడానికి మొదట తగిన నీటిని తీసుకుని అందులో బిర్యానీ ఆకులు వేసి బాగా మరిగించి ఆతర్వాత వచ్చిన మిశ్రమాన్ని గోరువెచ్చగా ఉన్నప్పుడు తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.

Share your comments

Subscribe Magazine