Health & Lifestyle

పట్టగొడుగులతో కలిగే ప్రయోజనాల గురించి మీకు తెలుసా?

Gokavarapu siva
Gokavarapu siva

ఈ ఉరుకుల పరుగుల జీవితంలో ఆహారపు అలవాట్లలోనూ అనేక మార్పులు వచ్చాయి. చాలా మంది తమ ఆరోగ్యం పై అధిక మొత్తంలో శ్రద్ధ చూపడం లేదు. అయితే, కరోనా మహమ్మారి కారణంగా ప్రస్తుతం చాలా మంది తమ శరీర రోగ నిరోధక శక్తి పెంచుకోవడానికి అనేక రకాల ఆహార పదార్థాలు తీసుకుంటున్నారు.

అయితే, శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచడంతో పాటు.. శరీరానిని అవసరమైన అనేక రకాల పోషకాలను, విటమిన్లను అందించే వాటిలో పుట్టగొడుగులు ప్రత్యేకం. పుట్టగొడుగులను ఆహారంగా తీసుకోవడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయని వైద్య ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

పుట్టగొడుగుల వల్ల కలిగే ప్రయోజనాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం.. పుట్టగొడుగులు శిలీంద్ర జాతికి చెందినవి. అందువల్ల వీటిపై చాలా మందికి అనేక రకాల అనుమానాలు, అపోహాలు సైతం ఉన్నాయి. ప్రజల్లో ఉన్నఅనేక సందేహాలు, అనుమానాలను తొలగిస్తూ.. పుట్టగొడుగుల్లో ఉన్న ఔషధ గుణాలను వివరిస్తూ.. వాటిని ఆహారంగా తీసుకోవాలని వైద్యారోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

పుట్టగొడుగులలో ఎన్నో రకాల పోషక విలువలు ఉంటాయి. ముఖ్యంగా పుట్టగొడుగుల్లో అధిక మొత్తంలో ఉన్న మాంనసకృత్తుల వల్ల మన శరీరానికి పుష్కలంగా పోషకాలు అందుతాయి. అలాగే, పుట్టగొడుగుల్లో ప్రోటీన్, విటమిన్లు, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగానే ఉంటాయి. మొత్తంగా మాంసంతో సమానంగా పుట్టగొడుగుల్లో శరీరానికి అవసరమైన అన్ని రకాల పోషకాలు ఉంటాయి.

ఇది కూడా చదవండి..

మరో శుభవార్త అందించిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి.. వారి ఖాతాల్లో నిధుల జమ

పుట్టగొడుగుల్లో పోటాషియం ఉంటుంది. ఇది శరీరం పక్షవాతం బారినపడే అవకాశాన్ని తగ్గిస్తుంది. పుట్టగొడుగులు అనేక రకాల వ్యాధులను తగ్గించడంలో సహాయపడుతాయని ఇప్పటికే అనేక పరిశోధనల్లో వెల్లడైంది. ముఖ్యంగా వీటిల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు ఊపిరితిత్తుల సంబంధిత అనారోగ్య సమస్యలు రాకుండా అడ్డుకుంటాయి. పొటాషియం, ఫైబర్ కారణంగా పుట్టగొడుగులు గుండె సంబంధ వ్యాధులు దరిచేరకుండా అడ్డుకుంటాయి.

దీంతో పాటు గుండే పనితీరును సైతం మెరుగుపరుస్తాయి. రక్తపోటును నియంత్రించడంలో సహాయపడతాయి. పుట్టగొడుగులలో ఉండే ఎరిటాడెనిన్, బీటా-గ్లూకాన్లు హైపోలిపిడెమిక్ లు ఊబకాయాన్ని తగ్గించడంలో మెరుగైన ఫలితాలు చూపిస్తాయి. పుట్టగొడుగులు అనేక రకాల క్యాన్సర్ల ప్రభావాన్ని తగ్గిస్తాయి. అగారికస్ అనే పుట్టగొడుగు రొమ్ము క్యాన్సర్‌కు వ్యతిరేకంగా పనిచేస్తుందని ఇప్పటికే అనేక అంతర్జాతీయ పరిశోధన అధ్యయనాలు వెల్లడించాయి.

ఇది కూడా చదవండి..

మరో శుభవార్త అందించిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి.. వారి ఖాతాల్లో నిధుల జమ

Share your comments

Subscribe Magazine