Health & Lifestyle

పాలు తెల్లగా ఎందుకుంటాయి అని ఎప్పుడైనా ఆలోచించారా?ఎందుకో తెలుసుకోండి

KJ Staff
KJ Staff
ever wondered why is milk white in colour?
ever wondered why is milk white in colour?

మనం రోజు పాలు తాగుతాం,అయితే ఈ పాలకి తెలుపు రేంజ్ ఎందుకు ఉంది అని ఎప్పుడైనా ఆలోచించారా? ఆకాశం లో అన్ని రంగులు ఉన్నపటికీ నీలం రంగుని ఎక్కువగా విచ్చిన్నం చేయడం వళ్ళ ఆకాశం అంతా నీలంగా కనపడుతున్నట్టే, పాలు కి అంటూ ఒక ప్రత్యేక రంగు అనేది లేదు. ఒక ప్రకృతి సహజ ప్రక్రియ వళ్ళ పాలు మనకి తెల్లగా కనిపిస్తాయి అంటే మీరు నమ్ముతారా.

పాలు అనేవి నీరు, ప్రోటీన్, కొవ్వు, లాక్టోస్ రూపంలో కార్బోహైడ్రేట్లు, కాల్షియం, విటమిన్లు, ఫాస్పరస్తో సహా ఖనిజాలు మరియు ఇతర బయోయాక్టివ్ సమ్మేళనాల శ్రేణితో తయారైన సహజమైన, సంపూర్ణ ఆహారం.

పాలలో సహజంగా నీరు, కొవ్వు మరియు ప్రోటీన్‌తో సహా ఇతర కొన్ని పదార్ధాలతో కలిసి కాంతిని ప్రతిబింబించే చిన్న కణాలు ఏర్పడతాయి .
పాలలో ఉండే ప్రధాన ప్రోటీన్ రకాల్లో కేసీన్‌లు ఒకటి, ఇవి క్యాల్షియం మరియు ఫాస్ఫేట్‌లతో కలిసి మైకెల్స్‌గా పిలువబడే చిన్న కణాలను ఏర్పరుస్తాయి. కాంతి ఈ కేసైన్ మైకెల్స్‌ను తాకినప్పుడు అది కాంతి వక్రీభవనానికి మరియు చెదరగొట్టడానికి కారణమవుతుంది, ఫలితంగా పాలు తెల్లగా కనిపిస్తాయి.

ఇది కూడా చదవండి

ఖాళీ కడుపుతో టీ తాగడం ఎంత ప్రమాదమో మీకు తెలుసా?

ఇంతకుముందు, పాలను డెలివరీ చేసెటప్పుడు చుస్తే, పసుపు రంగు కొవ్వు లేదా ఆవు పాలలోని క్రీమ్ వేరుగా సీసా పైభాగానికి చేరుకునేది.ఆ కొవ్వు కారణంగా పాలు కాస్త పసుపురంగులో కనపడేవి. నేడు, చుస్తే చాలా వరకు పాలను హోమోజీనైజషన్ (పాలను చాలా చిన్న నాజిల్‌ల ద్వారా ఒత్తిడిలో పంపడం ),చేయడం వళ్ళ ,కొవ్వు మరియు ప్రోటీన్ మైకెల్స్‌ను సమానంగా వెదజల్లుతూ మృదువైన, క్రీము ఆకృతిని మరియు రుచిని సృష్టిస్తున్నారు . దీనివల్ల పాలకు మరింత ప్రకాశవంతమైన తెల్లని రంగును ఏర్పడుతుంది.

 

పాలు తాగడం వళ్ళ కలిగే ప్రయోజనాలు:

  • ఎముకల ఆరోగ్యం మెరుగుపడుతుంది 
  • బరువు తగ్గడంతో సహాయపడుతుంది
  • డయాబెటిస్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది
  • గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది
  • కొన్ని రకాల క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది

ఇది కూడా చదవండి

ఖాళీ కడుపుతో టీ తాగడం ఎంత ప్రమాదమో మీకు తెలుసా?

Image credit: pexels.com

Share your comments

Subscribe Magazine