Health & Lifestyle

కోవిడ్ -19 యొక్క XE వేరియంట్ మొదటి కేసు ముంబైలో నమోదు !

Srikanth B
Srikanth B

కరోనావైరస్ వేరియంట్ Omicron XE యొక్క మొదటి కేసు ముంబైలో నమోదయింది మరియు NCDC, ఢిల్లీ ద్రువీకరించినట్లు అధికారులు శనివారం తెలిపారు.Omicron XE సోకిన వ్యక్తి 67 ఏళ్ల వ్యక్తి, అతను మార్చి 12 న ముంబై నుండి గుజరాత్‌లోని వడోదరకు వెళ్లి అక్కడ తేలికపాటి జ్వరంతో కూడిన లక్షణాలు కనిపించాయి

అతని నమూనాలను జీనోమ్ సీక్వెన్సింగ్ పరీక్షలకు పంపగా, శనివారం వెలువడిన ఫలితాల్లో అది ఓమిక్రాన్ ఎక్స్‌ఇ Omicron XE  అని తేలింది.

అతను కోవిషీడ్‌తో పూర్తిగా టీకాలు వేయబడ్డాడు, పూర్తిగా లక్షణరహితంగా మరియు  ఇప్పుడు అతని ఆరోగ్యం నిల్కడవుందని వైద్యులు తెలిపారు .

Omicron XE వేరియంట్ అనేది Omicron యొక్క BA.1 మరియు BA.2 జాతుల కలయిక మరియు ప్రాథమిక నివేదికల ప్రకారం ఎక్కువగా  వైరస్ వ్యాప్తికి  కారణమని కనుగొనబడింది.

జన్యు నిర్మాణంలో తరచుగా మార్పులు వైరస్‌ల సహజ జీవన గమనంలో భాగమైనందున ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ప్రభుత్వం తెలిపింది, అయితే అన్ని జాగ్రత్తలు పాటించాలని ప్రజలకు సూచించింది

"పొదుగు వాపు "వ్యాధికి నివారణను మించిన ఉత్తమమైన మార్గం లేదు" -ప్రొఫెసర్ డాక్టర్ కిషన్ కుమార్

Related Topics

covid XE variant of Covid-19

Share your comments

Subscribe Magazine