Health & Lifestyle

సిరిధాన్యాలతో సంపూర్ణ ఆరోగ్యం

KJ Staff
KJ Staff

పూర్వం ఈ భూమిలో మన పూర్వికులు పంటలను పండించి సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందిన దన్యలున్ ఇప్పుడు మనం చెప్పుకుంటున్న సిరిధాన్యాలే. కాలం మారే కొద్దీ నీటి లభ్యత, వ్యవసాయంలో మార్పులు రావడం, అభివృద్ధి చెందిన దేశాలాధిపత్య ప్రభావంతో మన ప్రాచీన మరియు సంప్రదాయ పంటలయిన కొర్రలు, ఊడలు, అరికలు, అందుకొర్రలు, అనే చిరుధాన్యాల సాగు కనుమరుగై నీటి ఆధారిత పంటలయిన వరి, గోధుమలు వాటి స్థానంలో పండించడం ప్రారంభమయింది. ఇందువల్ల వరి, గోధుమలు, మన ప్రధాన పంటలుగా మారాయి. దాని ద్వారా దీర్ఘకాలిక రోగాలు, కీళ్ల నొప్పులు వంటివి మన శరీరంలోకి రావడం ప్రారంభించాయి.

కొర్రలు

కొర్రలు లో తీపి, వగరు వంటి రుచులను కలిగి ఉంటాయి. ఈ ఆహరం తీసుకోవడం వాళ్ళ మధుమేహ వ్యాధిని తాగించవచ్చు. కొర్రలు లో యాంటీఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి మరియు మన శరీరంలో కొలెస్ట్రాల్ పరిమాణాన్ని తగ్గిస్తుంది. కొర్రలు చిన్న పిల్లలకు, గర్భిణీలకు మంచి ఆహరం ఎందుకనగా వీటిలో పీచు పదార్ధం, ఐరన్, మాంగనీస్, మెగ్నీషియం వంటి విటమిన్స్ను కలిగి ఉంటాయి. గుండెసంబంధిత జబ్బులు, రక్తహీనత, రక్తస్రావం వంటి వాటిని తగ్గించటానికి కొర్రలు తినటం మంచిది.

అండుకొర్రలు

మన సంప్రదాయ పంటల్లో అండుకొర్రలు కూడా ఒకటి. ఈ అండుకొర్రలను వండుకోవడానికి ముందు కనీసం 4 గంటలు నానబెట్టాలి. థైరాయిడ్, బి. పి. , జీర్ణాశయం, కంటి సమస్యలు, ఊబకాయ నివారణకు అండుకొర్రలు ఉపయోగపడతాయి. అంతేకాకుండా అల్సర్, రక్తం, ఎముకల, చర్మ సంబంధ క్యాన్సర్లచికిత్సకు బాగా ఉపయోగపడతాయి.

ఇది కూడా చదవండి..

శ్రీ అన్న యోజన : చిరుధాన్యాల వినియోగం కు పెద్ద పీట !

ఉదాలు

ఇవి తీయగా ఉంటాయి. ఉదాలతో తయారుచేసిన ఆహరం సులభంగా జీర్ణమవుతది మరియు బలవర్ధకరమైనది. ఈ ఆహరం అనేది ఎక్కువగా శారీరక శ్రమ లేకుండా ఎక్కువ సేపు కూర్చుని పని చేసేవారికి చాల మంచిది. ఉదాల్లో పీచు పదార్ధం ఎక్కువగా ఉండటం వలన ఇది మలబద్దకానికి మరియు మధుమేహానికి చాల మంచి ఆహరం. అంతేకాకుండా శరీర ఉష్ణోగ్రతలను సమస్థితిలో ఉంచుతుంది.

ఆరికెలు

ఆరికెలులో అధిక పోషకాలు ఉంటాయి కనుక వీటిని పిల్లలకు పెట్టడానికి చాల మంచి ఆహరం. అరికెల చేదు, తీపి, వగరు వంటి రుచులను కలిగి ఉంటాయి. వీటిలో అధిక యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి మన శరీర రక్తంలో చెక్కర, కొలెస్ట్రాల్ స్థాయిలను అదుపులో ఉంచడానికి ఉపయోగపడతాయి. పీచు పదార్ధం ఎక్కువగా ఉండటంవల్ల బరువు తగ్గటానికి ఇది మంచి ఆహరం. అరిక యొక్క పిండిని వాపులకు పూతగా కూడా వాడతారు.

ఇది కూడా చదవండి..

శ్రీ అన్న యోజన : చిరుధాన్యాల వినియోగం కు పెద్ద పీట !

సామలు

సామలు తీయగా ఉంటాయి. సామలను ఆహరంగ స్వీకరించడంవల్ల అనేక ఆరోగ్య సమస్యలకు చెక్ పెట్టచ్చు. పైత్యం ఎక్కువ అవడం వాల్ల భోజనం తరువాత కడుపు ఉబ్బరం, పుల్లతేన్పులు రావడం, వంటి సమస్యలకు మంచి ఔషధంగా సామలు పనిచేస్తాయి. ఈ ఆహారం తీసుకోవడం వల్ల మైగ్రేన్ వంటి సమస్య నుండి కూడా ఉపశమనం కలుగుతుది. పీచు పదార్ధం ఎక్కువగా ఉండటంవల్ల మలబద్దకంను అరికడుతుంది.


సిరిధాన్యాలు కొర్రలు, అండుకొర్రలు, సామలు, ఈధలు, అరికలు ప్రకృతి ప్రసాదించిన వారలు ఇవి. ఓషధ గుణాల సమ్మిళితమై తిండిగింజలు, అంతే కాదు ఆరోగ్యగుళికలు. వీటిని తింటూ 6 నెలల నుంచి 2 సవత్సరాలలో ఎవరైనా వారి వ్యాధులను నిర్ములించుకోవచ్చు. సిరిధాన్యాలు పోషకాలను అందరించడమే కాకుండా, రోగ కారకాలను శరీరం నుంచి తొలగించి, దేహాన్ని శుద్ధిచేస్తాయి. మనిషికి సంపూర్ణ ఆరోగ్యాని అందిస్తాయి.

ఇది కూడా చదవండి..

శ్రీ అన్న యోజన : చిరుధాన్యాల వినియోగం కు పెద్ద పీట !

Share your comments

Subscribe Magazine