Health & Lifestyle

లవంగం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు !

Srikanth B
Srikanth B

సాదారణముగా లవంగాలను కేవలం వంట నూనెలో వాడే మసాలా దినుసులుగా గానే చేస్తుంటాము కానీ రోజువారీ దినచర్యలలో తీసుకోవడం ద్వారా అనేక ప్రయోజనాలు కలుగుతాయి , మరియు లవంగాలు కల్గి వుండే అనేక పోషకాలను మనం ఇక్కడ చర్చించుకుందాం .

లవంగాలలో ఉండే పోషకాలు :

లవంగాలలో ఐరన్, కాల్షియం, ఫాస్పరస్, పొటాషియం, సోడియం, కార్బోహైడ్రేట్లు, హైడ్రాలిక్ యాసిడ్, విటమిన్ ఏ, మాంగనీస్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఈ పోషకాలు మన శరీరానికి ఎంతగానో ఉపయోగపడతాయి.

అంతే కాకుండా లవంగాలు దయానందిన జీవితంలో తీసుకోవడం వల్ల జలుబు, ఫ్లూ, దగ్గు, జ్వరం వంటి వ్యాధులు నివారణ అవుతాయని చెబుతున్నారు. లవంగాలు ఊపిరితిత్తుల క్యాన్సర్ ను తొలిదశలో ఉంటే నిరోధిస్తాయి అని సూచిస్తున్నారు. డయాబెటిస్ ను అదుపులో ఉంచడంలో కూడా లవంగాలు కీలకపాత్ర పోషిస్తాయని చెబుతున్నారు. ఇక లవంగాలు తినడం వల్ల వయసు పరంగా ఎముకల్లో వచ్చే సమస్యలను తగ్గించి నొప్పులు, వాపులను నివారిస్తాయి అని చెబుతున్నారు. దంతాల సమస్యలు, చిగుళ్ల సమస్యలు, నోటి దుర్వాసన సమస్యలు నోట్లో లవంగం వేసుకుంటే తగ్గుతుందని చెబుతున్నారు.

భార్యా పై అలిగి 42 సంవత్సరాలు అన్నం మానేసిన భర్త !

భోజనం తర్వాత లవంగాలను తింటే వచ్చే ఆరోగ్య ప్రయోజనాలు ఇవే:

ముఖ్యంగా లవంగాలను బ్యూటీ ప్రోడక్ట్ తయారు చేయడంలో, ఫార్మాస్యూటికల్స్ లలో ,ఔషధాలలో , వ్యవసాయ ఉత్పత్తులలో ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు. అదేవిధముగా భోజనం చేసిన తరువాత లవంగాన్ని తింటే జీర్ణ వ్యవస్థ సరిగా పని చేస్తుందని, పేగులు శుభ్రపడతాయని చెబుతున్నారు. కడుపులో సూక్ష్మజీవుల నుండి, వివిధ రకాల హాని కలిగించే క్రిముల నుండి, ఇన్ఫెక్షన్ల నుండి లవంగం శరీరాన్ని కాపాడుతుందని అంటున్నారు.

భార్యా పై అలిగి 42 సంవత్సరాలు అన్నం మానేసిన భర్త !

Share your comments

Subscribe Magazine