Health & Lifestyle

నల్ల బియ్యం తీసుకోవడం ద్వారా కలిగే ప్రయోజనాలు ..

Srikanth B
Srikanth B
Health Benefits of consuming black rice
Health Benefits of consuming black rice

 

రెండు తెలుగు రాష్ట్రాలలో వరి ప్రధాన పంట ..అయిన మనలో చాల తక్కువ మందికి మత్రమే నల్ల బియ్యం గురించి తెలుసు నల్ల బియ్యం.. సహజంగా తెల్లగా ఉండే బియ్యం రకాలను చూసి ఉంటాం. కానీ ఈ బియ్యం మాత్రం ఎంతో నల్లగా ఆకర్షణీయంగా ఉంటాయి. అయితే ఇవి ఎక్కువగా పండిచరు. అందుకే వీటిని ఫర్ బిడ్డెన్ రైస్ లేదా ఎంపరర్స్ రైస్ (చక్రవర్తుల బియ్యం) అని పిలుస్తారు.

పూర్వ కాలంలో ఈ బియ్యం కేవలం చక్రవర్తులు వారి కుటుంబ సభ్యులు మాత్రమే తినడానికి కేటాయించేవారు. ఇంకెవరూ దీన్ని తినకూడదని నియమం ఉండేది. దీన్ని తినడం వల్ల వారి ఆరోగ్యం బాగుండి.. ఎక్కువ కాలం జీవిస్తారని వారు నమ్మేవారట.నల్ల బియ్యం ఎక్కడ పుట్టింది అన్న విషయంలో ఇప్పటికీ పక్కా ఆధారాలు లేవు. మన దేశంలో మణిపూర్ లో ఈ బియ్యాన్ని ఎక్కువగా పండిస్తారు. అక్కడ ఈ బియ్యాన్ని చకావో అముబి అని పిలుస్తారు.


నల్ల బియ్యం ప్రయోజనాలు:

నల్ల బియ్యం లో ఫైబర్, విటమిన్ ఇ, నియాసిన్, క్యాల్షియం, మెగ్నీషియం, ఇనుము, జింక్ వంటివి ఎక్కువగా ఉంటాయి.
నల్ల బియ్యం డయాబెటిస్ ని అదుపులో ఉంచుతుంది. శరీరంలో ఇన్సులిన్ లెవల్స్ ని ఇది కంట్రోల్లో ఉంచుతుంది. ఈ బియ్యంలో ఫైబర్ ఎక్కువగా, క్యాలరీలు తక్కువగా ఉంటాయి. ఒబేసిటీ సమస్యను కూడా తగ్గిస్తాయి. దీన్ని మామూలు బియ్యానికి బదులు తినడం వల్ల బరువు వేగంగా తగ్గే వీలుంటుంది.

గుంటూరు మిర్చి యార్డులో భారీగా తగ్గిన మిర్చి నిల్వలు ..


  • నల్ల బియ్యంలో యాంథో సైనిన్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి కంటి వ్యాధులను నయం చేస్తాయి.

  • ఈ ఆంథో సైనిన్లు క్యాన్సర్ రాకుండా కాపాడతాయి. ముఖ్యంగా మహిళల్లో ఇవి క్యాన్సర్ నిరోధకాలుగా పనిచేస్తాయి.

  • ఈ బియ్యం గంజిని తలకు పట్టిస్తే వెంట్రుకలు చాలా బలంగా పెరుగుతాయి. ముఖానికి మాస్క్ గా వేసుకుంటే మచ్చలు మొటిమలు తగ్గిపోతాయి.

  • నరాల బలహీనత ఉన్నవారికి ఈ బియ్యాన్ని మసాజ్ చేసేందుకు కేరళ ఆయుర్వేదంలో ఉపయోగిస్తారు.

  • ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు చాలా ఎక్కువగా ఉంటాయి. అందుకే ఇది ఆరోగ్యాన్ని ముఖ్యంగా గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది.

  • లివర్ డీటాక్సిఫికేషన్ లో కూడా ఈ బియ్యం తోడ్పడుతుంది.

  • అధిక రక్త పోటు సమస్య నుంచి కూడా ఇది మనల్ని కాపాడుతుంది.
  • గుంటూరు మిర్చి యార్డులో భారీగా తగ్గిన మిర్చి నిల్వలు ..

Related Topics

BENEFITS OF BLACK RICE

Share your comments

Subscribe Magazine