Health & Lifestyle

బెండకాయ తో మీరు ఊహించలేని ఆరోగ్య ప్రయోజనాలు!గుండె జబ్బు నుండి కాన్సర్ వరకు అన్నీ దూరం!

KJ Staff
KJ Staff
health benefits of Okra
health benefits of Okra

బెండకాయ మనందరం రోజు వంటల్లో తినే కూరగాయ, అయితే దీనిని తినడం వల్ల శరీరానికి ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో మీకు తెలుసా.అవేంటో ఇప్పుడు మనం చూద్దాం.

1. కొలెస్ట్రాల్‌ని తగ్గిస్తుంది మరియు గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది
బెండకాయ తినడం ద్వారా శరీరంలోని ఎల్‌డిఎల్ కొలెస్ట్రాల్‌ను తగ్గించడం సాధ్యమవుతుంది. ఓక్రాలోని ఫైబర్ మరియు పెక్టిన్ ఎల్‌డిఎల్ కొలెస్ట్రాల్‌ను తొలగించడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. కొలెస్ట్రాల్‌ను తగ్గించడానికి బెండకాయ ఉత్తమమైన కూరగాయలలో ఒకటి. గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరిచేందుకు బెండకయ చాలా మంచి కూరగాయ అని నిపుణులు చెబుతున్నారు. గుండె ధమనులలో పేరుకుపోయిన కొలెస్ట్రాల్ను బెండలు తొలగించగలవు.

2. క్యాన్సర్‌కు వ్యతిరేకంగా పనిచేస్తుంది.
ఇది క్యాన్సర్ రోగులలో అలసటను తగ్గించడంలో సహాయపడుతుంది. బెండకాయలో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి, ఇవి క్యాన్సర్ కారక ఫ్రీ రాడికల్స్‌కు వ్యతిరేకంగా పనిచేస్తాయి.

3. వ్యాధి నివారణ విషయానికి వస్తే బెండకాయ విటమిన్ సి పుష్కలంగా ఉన్న కూరగాయ.గర్భంతో ఉన్న మహిళలకు ఫోలిక్ యాసిడ్ చాలా ముఖ్యమైన అంశం, బెండకాయలలో ఉండే ఫోలేట్ తల్లి మరియు బిడ్డకు సంపూర్ణ ఆరోగ్యాన్ని అందించడంలో సహాయపడుతుందని శాస్త్రీయ అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి.

4. బెండకాయలోని పోషకాలు పెద్దప్రేగులోని మంచి బ్యాక్టీరియాకు మద్దతునిస్తాయి. గట్‌లో ఎక్కువ టాక్సిన్స్ పేరుకుపోతే, శరీరంలోకి పోషకాలు మరియు ఖనిజాలను విడుదల చేయడానికి ఇబ్బంది పడుతుంది. కానీ ఈ బెండకాయ తినడం అనేది మంచి జీర్ణక్రియను సృష్టించడంలో సహాయపడుతుంది.బెండకాయ జీర్ణక్రియలో సహాయపడే కూరగాయ, బెండకాయలోని సమ్మేళనాలు శరీరంలోని పెద్ద ప్రేగులలో ప్రధాన భాగమైన కోలన్ ను శుభ్రపరచగలవు మరియు దాని నుండి విషాన్ని బయటకు పంపుతాయి. ఇందులోని పోషకాలు కోలన్ పోషకాలను చాలా త్వరగా గ్రహించేందుకు కూడా సహకరిస్తాయి.

ఇది కుడా చదవండి ..

ఖాళీ కడుపుతో టీ తాగడం ఎంత ప్రమాదమో మీకు తెలుసా?

5. బెండకాయ లోని తేమజిగురు వల్ల కొంచం తిన్న వెంటనే కడుపు నిండుతుంది. తిన్న వ్యక్తికి చాలా సమయం తర్వాత ఆకలి వేస్తుందని ఆరోగ్య నిపుణులు అధ్యయనాలు బట్టి నిర్ధారించారు.ఇది చాలా తక్కువ కేలరీల కూరగాయ. బరువు తగ్గాలనుకునే వారు బెండకాయను ఆహారంలో చేర్చుకోవడం మంచిది.

6. బెండకయ మూత్రవిసర్జనకారిగా పనిచేస్తుంది.బెండకాయ ఎక్కువగా తినే వ్యక్తులు హైడ్రేటెడ్ గా ఉండటానికి సహాయపడుతుంది. ఇది అదనపు మూత్రాన్ని బయటకు పంపడంలో కూడా సహాయపడుతుంది.

ఇది కుడా చదవండి ..

ఖాళీ కడుపుతో టీ తాగడం ఎంత ప్రమాదమో మీకు తెలుసా?

image source: pexels.com 

Share your comments

Subscribe Magazine