Health & Lifestyle

ఆకుకూరల వల్ల కలిగే ప్రయోజనాలు తెలిస్తే.. అస్సలొదలరు!

Srikanth B
Srikanth B
health benefits of having Leaf vegetable
health benefits of having Leaf vegetable

మనం ప్రతిరోజూ తీసుకునే ఆహారంలో అనేక రకాల ఆకుకూరలను వినియోగిస్తున్నాం.వీటిలో పాలకూర, గోంగూర, మెంతికూర, పుదీన, కొత్తిమీర, మునగాకు, కరివేపాకు మొదలైనవి ప్రధానంగా చెప్పుకోవచ్చు. ఆకుకూరలు ప్రతిరోజు ఆహారంలో తీసుకోవడం వల్ల మ‌న శ‌రీరానికి అవ‌స‌రం అవసరమైన విటమిన్ ఏ,డీ,కే,సి , మిన‌ర‌ల్స్, ఫైటో న్యూట్రియెంట్లు, ఐర‌న్‌, క్యాల్షియం, సోడియం, ఇత‌ర పోష‌కాలు సమృద్ధిగా లభిస్తాయి.ప్రతి రోజు వివిధ రకాల ఆకుకూరలు తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం.

ముఖ్యంగా ఆకుకూరల్లో ఉండే పాంటోథెనిక్ ఆమ్లం పిండి పదార్థాలను గ్లూకోజ్ రూపంలోకి మారుస్తాయి.అందుచేత శరీరానికి శక్తినిచ్చే ఇంధనంగా ఆకుకూరలు పనిచేస్తాయి.ఆకుకూరల్లో పదమూడు రకాల యాంటీ ఆక్సిడెంట్‌లు ఉన్నాయి. ఇవి యాంటీ క్యాన్సర్ ఏజెంట్లుగా పనిచేసి చ‌ర్మ క్యాన్స‌ర్ రాకుండా కాపాడుతుంది. ఆకుకూరల్లో ఉండే అధిక ఫైబర్ బరువును త‌గ్గించడంలో స‌హాయ ప‌డుతుంది. అలాగే మ‌ల‌బ‌ద్ద‌కంను నివారించి జీర్ణ‌క్రియను రేటు మెరుగుపరుస్తుంది.

తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం... త్వరలో రైతులకు డ్రోన్లు..

ఆకుకూరలు లభించే ఫ్లేవనాయిడ్స్,విట‌మిన్ కె నాడీ మండ‌ల వ్య‌వ‌స్థ‌పై ప్ర‌భావం చూపుతుంది. అందువ‌ల్ల మెద‌డు చురుగ్గా మారీ జ్ఞాప‌క‌శ‌క్తి పెరుగుతుంది. వయసుతోపాటు వచ్చే మతిమరపును దూరం చేస్తాయి.
ఆకుకూరలు పొటాషియం అధికంగా ఉంటుంది. కావున హైబీపీ స‌మ‌స్య ఉన్న‌వారు త‌ర‌చూ ఆహారంలో భాగంగా చేసుకుంటే మంచి ఫ‌లితం ఉంటుంది.

ఆకుకూరల్లో ఐరన్,కాల్షియం పాల‌కూర‌లో పుష్క‌లంగా ఉంటుంది. అందువ‌ల్ల ఎముక‌ల్లో సాంద్ర‌త పెరిగి ఎముక‌లు ఆరోగ్యంగా, దృఢంగా మారుతాయి. అలాగే విట‌మిన్ ఎ కంటి చూపును మెరుగు ప‌రిచి దృష్టి లోపాలను నివారిస్తాయి. కావున ప్రతి రోజు ఆకుకూరలు ఆహారంగా తీసుకోవడం వల్ల సహజ పద్ధతిలో మన ఆరోగ్యానికి కావలసిన అన్ని పోషకవిలువలు సమృద్దిగా పొందవచ్చు.

10 లక్షల కొత్త పింఛన్లు.. ఆగస్టు 15 నుంచి అమలు

Share your comments

Subscribe Magazine