Health & Lifestyle

గురక సమస్య ఎక్కువగా ఉందా? అయితే ఈ చిట్కాలు పాటించండి!

Gokavarapu siva
Gokavarapu siva

నేటికాలం ప్రజలకు గురక అనేది అనారోగ్య సమస్యల్లో సర్వసాధారణ సమస్యగా మారిపోయింది. అయిన కూడా ఈ సమస్యను తేలికగా తీసుకుంటే తర్వాత చాలా ఇబ్బంది పడవలసి ఉంటుంది. ఇలా గురక పెట్టడం వల్ల మన పక్కన పడుకునేవారికి చాలా ఇబ్బందిగా ఉంటుంది. వారికి సరిగ్గా నిద్ర కూడా పట్టదు. మనకు ఈ గురక ఎలా వస్తుంది మరియు ఈ సమస్యను ఎలా తగ్గించుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

గురక వివిధ కారణాల వల్ల సంభవించవచ్చు. నిద్రిస్తున్న సమయంలో శ్వాస తీసుకునేటప్పుడు వోకల్ కార్డులను వైబ్రేట్ అవ్వడం వల్ల ఈ సమస్య వస్తుంది. నిద్రించే సమయంలో ముక్కు, నోటి నుంచి గాలి ఫ్రీగా వెళ్లకపోవడం గురకకు ముఖ్యమైన కారణంగా చెప్పొచ్చు. ఇది అలెర్జీలు, అడినాయిడ్స్‌లో ఇన్‌ఫెక్షన్లు, ముక్కు లోపల మంట లేదా వాయుమార్గంలో అడ్డంకి కారణంగా చెప్పవచ్చు. మనం ఎక్కువ గాలి పీల్చుకోవడం వల్ల గురక శబ్దం పెద్దగా పెరుగుతుంది.

మధ్య వయస్కుల్లో ఎక్కువగా ఊబకాయం వల్ల గురక సమస్య వస్తోంది. అయితే పెద్దవారిలో మాత్రం శరీరంలోని ఇతర కండరాలు బలహీనపడినట్లే మెడ కండరాలు కూడా బలహీనంగా తయారవుతాయి. అందుకే వాళ్లు శ్వాస తీసుకున్నప్పుడు బాగా గురక వస్తుంది. శ్వాసకోశ సమస్యలు, సైనస్ సమస్యలు, ధూమపానం మరియు మద్యపానం వంటి ఇతర అంశాలు కూడా గురకకు కారణం కావచ్చు.

ఇది కూడా చదవండి..

గుడ్ న్యూస్.! రైతుల సమస్యలకు పరిష్కారంగా ధరణిలో కీలక మార్పులను తీసుకురానున్న ప్రభుత్వం..

ఈ సమస్యను సమర్థవంతంగా పరిష్కరించడానికి, గురకను తగ్గించడానికి అనేక చిట్కాలను పాటించవచ్చు. ఒక ఉపయోగకరమైన చిట్కా ఏమిటంటే, ఒక గ్లాసు నీటిలో కొన్ని చుక్కల పిప్పరమెంటు నూనెను వేసి రాత్రి నిద్రపోయే ముందు నోటిలో వేసుకొని పుక్కిలించడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.

మనం గురకాని నెయ్యిని ఉపయోగించడం ద్వారా కూడా తగ్గించుకోవచ్చు. నెయ్యి అనేది నాసికా రంధ్రాలను క్లియర్ చేయడం ద్వారా గురకను సమర్థవంతంగా నియంత్రిస్తుంది. ప్రతి రాత్రి నిద్రపోయే ముందు అర టీస్పూన్ యాలకుల పొడిని వేడి నీటితో కలిపి తీసుకోవడం వల్ల ఈ గురక సమస్య తగ్గుతుంది. ధూమపానం, మద్యపానం అలవాటు ఉన్నవారు వెంటనే వాటిని వదిలేయాలి. అధిక బరువు ఉన్న వారు దానిని అదుపులో ఉంచుకోవాలి.

ఇది కూడా చదవండి..

గుడ్ న్యూస్.! రైతుల సమస్యలకు పరిష్కారంగా ధరణిలో కీలక మార్పులను తీసుకురానున్న ప్రభుత్వం..

Related Topics

snoring problem tips

Share your comments

Subscribe Magazine