Health & Lifestyle

బ్రష్ చేసేటప్పుడు ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!

KJ Staff
KJ Staff

ఈ రోజుల్లో సర్వసాధారణంగా ప్రతి ఒక్కరిని వేధిస్తున్న సమస్యల్లో దంత సమస్యలు కూడా ప్రధానమైనవి గానే చెప్పుకోవచ్చు.సాధారణంగా ప్రతి రోజూ మనం తీసుకొనే ఆహారం కొంత పళ్ళ సందుల్లో ఉండిపోవడం వల్ల బ్యాక్టీరియా వృద్ధి జరిగి దంత సమస్యలు, చిగుళ్ల వాపు, చిగుళ్ల నుంచి రక్తం కారడం వంటి సమస్యలతో బాధ పడాల్సి వస్తుంది.ఈ సమస్యలు మరీ ఎక్కువైతే నోటిలోపల ఇన్ఫెక్షన్ కారణంగా రక్తంలో ఇన్ ఫ్లమ్మేటరీ పదార్థాలను పెంచుతుంది. దీంతో రక్తం గడ్డకట్టడం, మింట్గుండెకు రక్త సరఫరా సరిగా జరగక గుండె జబ్బులకు కారణం కావచ్చు.

దంత సమస్యల నుంచి విముక్తి పొందాలంటే విటమిన్ సి ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకోవడంతో పాటు ప్రతిరోజూ ఉదయం, రాత్రి నిద్రకు ముందు బ్రష్ చేసుకోవడం అలవాటు చేసుకోవాలి.దీనికి కారణం మనం తీసుకున్న ఆహారం పళ్లపై ప్లాక్యూ ఏర్పడడానికి 4 నుంచి 12 గంటల సమయం పడుతుంది. కావున ప్రతి 12 గంటలకు ఒకసారి బ్రష్ చేసుకున్నట్లయితే పళ్ళ సందుల్లో పేరుకుపోయిన ప్లాక్యూ తొలగి దంతాలు ఆరోగ్యంగా ఉంటాయి.అయితే బ్రష్ చేసుకున్న ప్రతిసారీ కొన్ని పద్ధతులు తప్పనిసరిగా పాటించాలి అవేంటో ఇప్పుడు చూద్దాం.

మొదట మన టూత్ బ్రష్ దంతాల అంచుల వరకు వెళ్ళ గలిగేలా ఉండి మృదువుగా ఉండేలా చూసుకోవాలి. అలాగే ప్రతి మూడు నెలలకు ఒక టూత్ బ్రష్ తప్పనిసరిగా మార్చాలి.కనీసం రెండు లేదా మూడు నిమిషాల పాటు దంతాలను బ్రషింగ్ చేసుకోవడం తప్పనిసరి. మరీ ఎక్కువ ఒత్తిడి ఉపయోగించి ఎక్కువ సమయం బ్రషింగ్ చేసిన దంతాలపై ఉన్న ఎనామిల్ పొర దెబ్బ తిని దంతక్షయానికి కారణమవుతుంది.చిగుళ్లపై బ్రష్ ను 45 డిగ్రీల కోణంలో ఉంచి పట్టు కొని బ్రషింగ్
చేయాలి ఇలా చేయడం వల్ల ఆరోగ్యమైన దంతాలు మీసొంతం అవుతాయి.

Share your comments

Subscribe Magazine