ప్రపంచంలో ఎంతో మందిని బాధిస్తున్న ఆరోగ్య సమస్యల్లో మూత్రపిండాల సమస్య ప్రధానమైనది. ఇండియన్ సొసైటీ ఆఫ్ నెఫ్రోలోజి ఆధ్యయనం ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 84 కోట్ల మంది కిడ్నీ వ్యాధులతో భాదపడుతున్నారు. కిడ్నీ వ్యాధి ముదిరినట్లైతే మనిషి ప్రాణాలుకోల్పోయే అవకాశం ఉంటుంది. కిడ్నీ వ్యాధి శరీరంలోని ఇతర అవయవాలను కూడా దెబ్బతీసే ప్రమాదం ఉంది. కాబట్టి కిడ్నీ వ్యాధిని ముందుగానే గుర్తించి చికిత్స తీసుకోవడం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. అయితే కిడ్నీ సమస్యలు ఆరంభ దశలో ఉన్నపుడు గుర్తించడం సాధ్యంకాదు. వ్యాధి ఎక్కువయ్యాకే వ్యాధి లక్షణాలు బయటపడతాయి.
మూత్రపిండాలు శరీరంలో ఫిల్టర్లు లాగా పనిచేస్తాయి. కిడ్నీలు రక్తాన్ని శుద్ధిచేసి మలినాల్ని మూత్రం రూపంలో బయటకి పంపిస్తాయి. రక్తంలో అధికంగా ఉన్న మినరల్స్ బయటకి పంపించడంలో సహాయపడతాయి. కిడ్నీ సమస్యలు ఉన్నవారిలో ప్రక్రియ సరిగ్గా జరగక శరీరంలో మలినాలు పేరుకుపోయి మనిషి అస్వస్ధతకు గురవుతాడు. కిడ్నీ సమస్యలు రావడానికి అనేక కారణాలు ఉన్నాయి, వాటిలో జన్యుపరమైన లోపాలు, ఆహారపు అలవాట్లు, జీవనశైలి వంటివి కారణాలు కావచ్చు. భారత దేశంలో వయోజనులు అధికగం కిడ్నీ సమస్యలతో బాధపడుతున్నట్లు ఇండియన్ సొసైటీ అఫ్ నెఫ్రోలోజి పేర్కొంది. వయసు పెరిగేకొద్దీ కిడ్నీ పనితీరు మందగించి శరీరంలో వ్యర్ధాల తొలగింపు జరగక కిడ్నీ వ్యాధులు తలెత్తుతాయి. అయితే వ్యాధి మొదటి దశలో ఉన్నపుడు కిడ్నీ సమస్యలను గుర్తించడం కష్టం, వ్యాధి ముదురుతున్నకొద్దీ ఒక్కొక్కటిగా లక్షణాలు బయటపడతాయి.
వివిధ కిడ్నీ సమస్యలతో బాధపడుతున్నవారికి లక్షణాలు కూడా వేరుగా ఉంటాయి అయితే అందరిలోనూ,సాధారణంగా వికారంగా ఉండటం, వాంతులు రావడం, నీరసంగా ఉండటం, మూత్రం ఎక్కువ లేదా తక్కువ రావడం ప్రధానంగా గమనించవచ్చు. కిడ్నీ సమస్యల్లో చాల మందిని ప్రధానంగా వేదించే సమస్య కిడ్నీలో రాళ్లు. కిడ్నీలో ఉప్పు మరియు ఇతర ధాతువులు పేరుకుపోయి స్పటికంగా మారిపోయిన వాటిని కిడ్నీ రాళ్లుగా పరిగణిస్తారు. కిడ్నీలో రాళ్లు ఉన్నవారిలో మూత్ర విసర్జన సమయంలో నొప్పి, రాయి ఉన్న భాగంలో నొప్పి, మూత్రనాళంలో రాళ్లు అడ్డుబడటం వంటి ప్రధాన లక్షణాలుగా గమనించవచ్చు. నీరు తక్కువతాగడం, ఆహారపు అలవాట్లు, ఊబకాయం ఉన్నవారిలో కిడ్నీలో రాళ్లు వచ్చే అవకాశం ఉంది.
నేడు ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది షుగర్ వ్యాధితో భాదపడుతున్నారు. షుగర్ వ్యాధి ఉన్నవారిలో కిడ్నీ డయాబెటిక్ కిడ్నీ వ్యాధి వస్తుంది. ఈ వ్యాధి ఉన్నవారిలో కిడ్నీ పాడయ్యే అవకాశం చాల ఎక్కువ. కనుక షుగర్ వ్యాధి ఉన్నవారు, రక్తంలో షుగర్ లెవెల్స్ నియంత్రణలో ఉంచుకోవడం అత్యంత కీలకం. డయాబెటిక్ కిడ్నీ వ్యాధి ముదురుతున్న కొద్దీ, కాళ్ళు ఉబ్బడం, మూత్రవిసర్జనలో రక్తం రావడం, బరువు తగ్గడం, వాంతులు వంటి లక్షలను గమనించవచ్చు. వ్యాధి లక్షలను కనిపించిన వెంటనే చికిత్స తీసుకుంటే కిడ్నీ వైఫల్యం నుండి కాపాడుకోవచ్చని వైద్యులు సూచిస్తున్నారు.
కిడ్నీ వైఫల్యం ఉన్నవారిలో వ్యాధి ముదిరిన తరవాత మాత్రమే లక్షణాలు బయటపడతాయి. వ్యాధిని మొత్తం ఐదు దశలుగా పరిగణిస్తారు. నాలుగో దశ వరకు ఎటువంటి లక్షణాలు కనిపించవు. కిడ్నీ పనితీరు 100 నుండి 10 శాతానికి తగ్గిపోయాకే వ్యాధి లక్షణాలు ప్రభలమౌవుతాయి వ్యాధి పెరిగేకొద్దీ ఆకలి మందగించడం, వాంతులు, నిద్రలేమి, కాళ్ళ వాపులు మొదలైన సమస్యలు తలైతే అవకాశం ఉంటుంది.
Share your comments