Health & Lifestyle

పోస్ట్ ఆఫీస్ ఫ్రాంచైజీని తెరవండి, ప్రతి నెలా 50 వేలకు పైగా సంపాదించండి!

S Vinay
S Vinay

పోస్టాఫీసు ఉత్తరాలు చేరవేసేదే కాకుండా మనకి ఎన్నో రకాల స్కీమ్ లను అందిస్తుంది. అయితే ఇప్పుడు పోస్టాఫీసు మనకి తక్కువ పెట్టుబడితో ఆదాయ వనరుగా మారబోతుంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు చదవండి.

మీరు ఇప్పుడు పోస్టాఫీసును మీ సంపాదన సాధనంగా చేసుకోవచ్చు. దీనికి ఎక్కువ పెట్టుబడి లేదా డిగ్రీ-డిప్లొమా అవసరం లేదు. కేవలం ఎనిమిదో ఉత్తీర్ణత సాధించిన వ్యక్తి కూడా పోస్టాఫీసును ఆదాయ వనరుగా మార్చుకోవచ్చు.ఇక్కడ మనం పోస్టాఫీసు ఫ్రాంచైజీ గురించి మాట్లాడుతున్నాం. పోస్టాఫీసు ఫ్రాంచైజీని తీసుకోవడం ద్వారా, మీరు ప్రతి నెలా 50 వేల రూపాయల వరకు సంపాదించవచ్చు. ఫ్రాంచైజీని తీసుకోవడం ద్వారా, మీరు గ్రామంలో లేదా నగరంలో ఎక్కడైనా పోస్టాఫీసులో పని చేయడం ద్వారా సంపాదించడం ప్రారంభించవచ్చు.

దేశవ్యాప్తంగా సుమారుగా 1.56 లక్షల పోస్టాఫీసు బ్రాంచులున్నప్పటికీ, మరిన్ని కొత్త అవుట్‌లెట్లకు డిమాండ్ పెరుగుతూనే ఉంది.కాబట్టి ప్రజలకు పోస్టల్ సౌకర్యాలను అందించడానికి ఫ్రాంచైజ్ అవుట్‌లెట్ తెరవాల్సిన అవసరం ఉంది.అయితే భారతీయ పౌరులు ఎవరైనా ఈ పని చేయవచ్చు. ఫ్రాంచైజీని తీసుకునే వ్యక్తి వయస్సు 18 సంవత్సరాల కంటే ఎక్కువ ఉండాలి మరియు కేవలం 8వ తరగతి పాస్ అయి ఉంటె చాలు.

పోస్టాఫీసు ఫ్రాంచైజీని తీసుకున్న తర్వాత, మీరు కమీషన్ ద్వారా సంపాదిస్తారు. ఇందులో, మీరు రిజిస్టర్డ్ ఆర్టికల్స్, స్పీడ్ పోస్ట్ బుకింగ్, మనీ ఆర్డర్లు, రిజిస్ట్రీ, పోస్టల్ స్టాంపులు, పోస్టల్ స్టేషనరీ మరియు మనీ ఆర్డర్ ఫారమ్‌లను విక్రయించడం ద్వారా సంపాదించవచ్చు.

ఫ్రాంచైజీని ఎలా తీసుకోవాలి
పోస్టాఫీసులో రెండు రకాల ఫ్రాంచైజీలు ఉన్నాయి. ఒకటి అవుట్‌లెట్ ఫ్రాంచైజీ కాగా మరొకటి పోస్టల్ ఏజెంట్ల ఫ్రాంచైజీ. మీరు ఈ రెండు ఫ్రాంచైజీలలో దేనినైనా తీసుకోవచ్చు.మీరు ముందుగా పోస్టాఫీసు ఫ్రాంచైజీకి దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు చేయడానికి, మీరు ఇండియన్ పోస్టాఫీసు వెబ్‌సైట్ www.indiapost.gov.in వెళ్లాల్సి ఉంటుంది. ఇక్కడ నుండి మీరు ఫారమ్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు మరియు ఫ్రాంచైజీ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.

మరిన్ని చదవండి.

పెరగనున్న LPG సిలిండర్ ధరలు...కొత్తగా వస్తున్న సబ్సిడీ ఎంత?

Share your comments

Subscribe Magazine