Health & Lifestyle

ముల్లంగిని తీసుకోవడానికి సరైన సమయం ఏమిటి?

KJ Staff
KJ Staff

ముల్లంగిలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ప్రతిరోజు ఒక చిన్న కప్ ముల్లంగి ముక్కలు తినడం ద్వారా శరీరానికి అవసరమయ్యే ఎన్నో పోషకాలు లాభాయమవుతాయి. ముల్లంగిని పచ్చిగా సలాడ్ రూపంలో, లేదా కొన్ని వంటకాల్లో కలిపి తినవచ్చు. అయితే ముల్లంగిని తినేందుకు కూడా సమయం ఉంటుంది.


ముల్లంగి ఆకులను మరియు దుంపలను ప్రజలు సాధారణంగా తింటుంటారు. ముల్లంగి కారకారలాడుతూ, తినేటప్పుడు కొంచెం కరంగా ఉంటుంది. ముల్లంగిని సలాడ గా మరికొన్ని ప్రాంతాల్లో పచ్చడిగా చేసి తింటారు. దీని విభిన్న రుచి కొందరి నచ్చకపోయినా, ముల్లంగిలో ఉండే ఆరోగ్య ప్రయోజనాల కారణంగా వైద్యులు దీనిని తినమని సూచిస్తుంటారు. అయితే ముల్లంగిని ఎటువంటి సమయంలో తీసుకుంటే అధిక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయో ఇపుడు తెలుసుకుందాం.

ఉదయం అల్పహారంతో తీసుకోవడం:

ముల్లంగిని ఉదయం బ్రేక్ఫాస్ట్ తో తీసుకోవడం ద్వారా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. మీ రోజును ఒక కప్పు ముల్లంగి ముక్కలతో మొదలుపెట్టడం ద్వారా రోజు మొత్తం ఎంతో ఎనర్జీతో పనిచెయ్యగలరు. ముల్లంగిని పచ్చిగా తినడం ఇష్టం లేనివారు, ఆమ్లెట్లో లేదా సెన్విచ్ లో తినవచ్చు, దీని ద్వారా ఆహారంలో రుచి పెరుగుతుంది. అంతేకాకుండా, ముల్లంగిలో తక్కువ కెలోరీలు ఉండటం మూలాన రక్తంలోని చక్కెర శాతాన్ని నియంత్రిస్తుంది. ముల్లంగి నుండి లభ్యమయ్యే అధిక ఫైబర్ పొట్ట ఆరోగ్యాన్ని పెంపొందిస్తుంది.


ఫాస్ట్ ఫుడ్స్ కి ప్రత్యామ్నాయం:

సాయంత్రం అయితే చాలు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్ల వద్ద మరియు బజ్జి బల్ల వద్ద జనం గుముగూడుతారు. వాటిని తిందాం వల్ల అనేక దుష్ప్రభావాలు కలిగిన జనం వీటిని తినడం మనలేరు. చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లు, అసిడిటీ వంటి సమస్యల భారిన పడిన తర్వాత, ఆరోగ్యకరమైన ఆహారాల వైపు చూస్తారు. ఇటువంటి పరిస్థితి తలెత్తకుండా ముందుగానే ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం మంచిది. ముల్లంగిని సాయంత్రం వేళలో చిరుతిండి లాగా తీసుకుంటే, ఆకలిని తీర్చడమే కాకుండా మంచి ఆరోగ్య ప్రయోయోజనాలను కూడా కలిగిస్తుంది.

రాత్రి వేళల్లో ముల్లంగికి నో చెప్పండి:

ముల్లంగి ఎంత ఆరోగ్యకరమైన, రాత్రి వేళల్లో తీసుకోవడం ద్వారా కొన్ని దుష్ప్రభావాలను కలిగిస్తుంది. ముల్లంగిలో ఉండే రఫినోస్ అనే సమ్మేళనాలు పొట్టలో గ్యాస్ ఏర్పరిచి, పొట్ట ఉబ్బేటట్లు చేస్తుంది. రాత్రి వేళల్లో అధిక మొత్తంలో ముల్లంగిని తినడం ద్వారా నిద్రపోయే సమయంలో ఆసౌకర్యాని కలిగిస్తుంది. కనుక ముల్లంగిని రాత్రి సమయాల్లో అవాయిడ్ చెయ్యడం మంచిది.

Share your comments

Subscribe Magazine