Health & Lifestyle

దోమల శత్రువు.. ఈ మొక్కలే?

KJ Staff
KJ Staff

సాధారణంగా మన ఇంటి చుట్టూ వివిధ రకాల మొక్కలు ఉండటం వల్ల దోమల బెడద అధికంగా ఉంటుంది. ఆ చెట్టు పొదలో దోమలు అభివృద్ధి చెంది మనపై దాడి చేస్తాయి. ఈ క్రమంలోనే ఎన్నో జబ్బుల భారీన పడాల్సి వస్తుంది.అయితే మన ఇంటి ఆవరణంలో కొన్ని రకాల మొక్కలు ఉండటం వల్ల మనకు దోమల బెడద చాలా తక్కువగా ఉంటుంది. మరి ఆ మొక్కలు ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం...

తులసి: ఎన్నో ఔషధ గుణాలు దాగి ఉన్న తులసి మొక్క సాధారణంగా ప్రతి ఒక్క ఇంటి ఆవరణంలో మనకు కనబడుతుంది.తులసి మొక్కలో ఎన్నో ఔషధగుణాలున్నాయి. ఔషధ గుణాలు పుష్కలంగా ఉండటం వల్ల దోమలను మాత్రమే కాకుండా ఎన్నో రకాల క్రిమికీటకాలను మన దరి చేరకుండా కాపాడుతుంది.

నిమ్మగడ్డి: నిమ్మగడ్డి మన ఇంటి ఆవరణంలో ఉండటం వల్ల ఈ గడ్డి నుంచి వెలువడే సువాసనలు మన ఇంటిలోకి ఎలాంటి క్రిమి కీటకాలు దోమలు రాకుండా ఆపుతుంది.

లావెండర్: సుగంధ పరిమళాలను వెదజల్లే మొక్కలలో లావెండర్ ఒకటి. ఈ మొక్క నుంచి వెలువడే సుగంధపరిమళాల వల్ల ఎలాంటి క్రిమి కీటకాలు దోమలు మన ఇంటి లోనికి ప్రవేశించవు.

అగిరేటమ్ : అగిరేటమ్ గోట్ వీడ్, జంగిల్ పుదీనా అనికూడా అంటారు. ఈ మొక్కలు వంగపండు రంగులో పువ్వులు పూస్తాయి. ఈ పువ్వుల నుంచి వచ్చే సువాసన క్రిమికీటకాలను ఆపుతుంది.

క్యాప్ నిప్: దీనిని క్యాట్ మింట్ అని కూడా పిలుస్తారు. ఈ మొక్క నుంచి వచ్చే నూనెలను వివిధ రకాల మందులు పర్ఫ్యూమ్ లలో ఉపయోగిస్తారు. ఈ నూనె దోమలను కీటకాలను నివారించడానికి దోహదపడుతుంది.

Share your comments

Subscribe Magazine