బయట ఎండలు మండిపోతున్నాయి. దాదాపు అన్ని ప్రాంతాల్లో 40-45 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతుంది. ఎండకు వాతావరణ తేమ తోడై, ఉక్కబోత చీరెక్కిస్తుంది. వేసవి కాలంలో అందరూ ప్రధానంగా ఎదురుకునే సమస్య చమట దుర్వాసన. ఉద్యోగాలకోసం ప్రతిరోజు ఎక్కువ దూరం ప్రయాణంచేసేవారు, ఆఫీసుకు చేరుకునే సమయానికి చమట కారణంగా తడిచి ముద్దవుతారు. చమట కారణంగా శరీర దుర్వాసన వచ్చి రోజంతా చికాకు పుట్టిస్తుంది. చమట నుండి వచ్చే వాసన నుండి తప్పించుకోవడానికి, డిఒడ్రంట్స్ వాడినసరే పెద్ద ప్రయోజనం కనిపించదు. అయితే ఈ సమస్యను కొన్ని చిట్కాల ద్వారా నియంత్రించవచ్చు.
శరీరాన్ని శుభ్రంగా ఉంచుకోవడం:
చమట ద్వారా శరిరంపై ఏర్పడే బాక్టీరియా శరీర దుర్వాసనకు ప్రధాన కారణంగా నిలుస్తుంది. సాధారణంగా మన శరీరం నుండి వచ్చే చమటకు ఎటువంటి వాసన ఉండదు కానీ చమట నీరుకు బాక్టీరియా తోడై ఈ వాసనను కల్గిస్తుంది. చమట ఎక్కువగా పట్టే శరీర భాగాల్లో ఈ బాక్టీరియా పేరుకుపోయి, దురదను, దుర్గంధాన్ని విడుదల చేస్తుంది. ఈ బాక్టీరియా పేరుకుపోకుండా ఉండేందుకు, వేసవి కాలంలో కనీసం రోజుకు రెండు సార్లైనా స్నానం చెయ్యాలి. తద్వారా శరిరం పై పేరుకుపోయిన బాక్టీరియా తొలగి, చమట వాసన తగ్గుతుంది.
సరైన సోపా ను ఎంచుకోండి:
మారుతున్న జీవన ప్రమాణాలకు తగ్గట్టుగా, ప్రతీ కాలానికి అనువైన సోప్స్ మార్కెట్లో విరివిగా లభిస్తున్నాయి. వేసవి కాలంలో యాంటిబ్యాక్టర్టిల్ సోప్స్ ఎంచుకోవడం ఉత్తమం. ఈ సోప్స్ బాక్టీరియా శరీరంపై పేరుకుపోకుండా చేసి చమట దుర్వాసననను తగ్గించడంలో మీకు సహాయపడతాయి. శాస్త్రీయ పద్ధతులు పాటించాలి అనుకునేవారు, సున్ను పిండి, కుంకుడు కాయ రసంతో స్నానం చెయ్యడం ద్వారా చమట దుర్వాసనను తగ్గించడమే కాకుండా, సహజసిద్ధమైన కాంతిని శరీరానికి అందిస్తుంది.
శుభ్రమైన దుస్తులు ధరించాలి:
చాలామంది, సమయంలేక వేసుకున్న దుస్తులనే తరచు వాడుతూ ఉంటారు. మాసిన బట్టలను మల్లి మల్లి వేసుకోవడం ద్వారా బట్టలోని మలినాలు శరీరంపై చేరి దుర్గంధానికి కారణం అవుతాయి. ముఖ్యంగా వేసవి కాలంలో ఇలా మాసిన బట్టలను తిరిగి వాడటం తగ్గించాలి. అంతే కాకుండా మాసిన సాక్స్ కూడా వాడటం మంచిది కాదని గుర్తుపెట్టుకోండి.
తినే ఆహారం సరిచూసుకోండి:
వేసవి కాలంలో తీసుకునే ఆహారంలో కూడా తగు జాగ్రత్తలు పాటించడం ఉత్తమం. స్పైసీ ఫుడ్స్ కూడా చమట వాసనకు ఒక కారణం, కనుక స్పైసీ ఫుడ్స్ అధికంగా తినేవారు వీటిని కొంతమేరకు తగ్గించడం మంచిది. మద్యం ప్రియుల నుండి ఈ శరీర దుర్గన్ధమ్ అధికంగా వస్తుంది, కనుక ఆల్కహాల్ ఎక్కువ సేవించేవారు, మద్యానికి దూరంగా ఉండటం మంచిది.
Share your comments