టీ తాగడానికి చాలామంది టీ బ్యాగులను ఉపయోగిస్తారు. అవి వాడిన తర్వాత అలాగే చెత్త బుట్టలో పడేస్తుంటారు.
ఎప్పుడో ఒకసారి తాగే వారి పరిస్థితి అయితే ఫర్వాలేదు కానీ తరచూ టీ తాగే వారికి ఇలా వాడి పడేసే బ్యాగ్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. వీటిని అలాగే చెత్తలో పడేసే బదులు వీటిని రకరకాలుగా ఉపయోగించుకోవచ్చు. అద్భుతమైన ప్రయోజనాలు పొందొచ్చు.
టీ బ్యాగ్స్ తిరిగి ఉపయోగించే మార్గాలు
కార్పెట్లను కొత్తగా మార్చేయండి..
టీ బ్యాగ్స్ లోని టీ ఆకులను ఉపయోగించి మీ పాత కార్పెట్లను కొత్తగా మార్చుకోవచ్చు. దీనికోసం టీ బ్యాగ్స్ ని ఎండబెట్టుకోవాలి. ఆ తర్వాత దాన్ని పక్కన పెట్టుకోవాలి. ఈ టీ ఆకులకు బేకింగ్ సోడా కలుపుకోవాలి. దీన్ని కార్పెట్ పైన పూసుకోవాలి. దీన్ని ఉపయోగించడం వల్ల కార్పెట్ పైన ఉన్న మరకలు, దానికి ఉన్న వాసన పూర్తిగా తొలగిపోతాయి. టీ ఆకులు, బేకింగ్ సోడా రెండూ వాసనను పీల్చుకోవడమే కాకుండా మరకలను కూడా మాయం చేసేస్తాయి. ఇలా వాటిపై రుద్దిన కొన్ని గంటల తర్వాత దాన్ని తీసేయాలి. అంతే.. కార్పెట్ ఫ్రెష్ గా కొత్తగా కనిపిస్తుంది.
ఫేస్ స్క్రబ్ లా వాడండి.
టీ బ్యాగ్ లో మిగిలిన మిశ్రమాన్ని ఫేస్ స్క్రబ్ గా ఉపయోగించవచ్చు. ఇది మీ ముఖంపై ఉన్న రంధ్రాలను చిన్నగా మారుస్తుంది. మీ ముఖానికి అందమైన మెరుపును అందిస్తుంది. దీనికోసం చేయాల్సిందల్లా ఒక టేబుల్ స్పూన్ తేనె తీసుకొని అందులో ఒక వాడేసిన టీ బ్యాగ్ లోని టీ మిశ్రమాన్ని చేర్చుకోవచ్చు. స్క్రబ్ మిశ్రమాన్ని మీ ముఖంపై అప్లై చేసుకొని గుండ్రంగా తిప్పుతూ చేతులతో మసాజ్ చేసుకోవాలి. ఇలా ఐదు నిమిషాల పాటు చేసిన తర్వాత మీ ముఖాన్ని గోరు వెచ్చని నీటితో కడుక్కోవాలి.
మీ కళ్లకు రిలాక్సేషన్ అందిస్తుంది.
టీ బ్యాగ్స్ ని ఉబ్బిన, నొప్పి పుడుతున్న కళ్ల మీద పెట్టడం వల్ల మంచి ప్రయోజనం ఉంటుంది. వెంటనే ఫలితం కనిపిస్తుంది. దీనికోసం వాడేసిన టీ బ్యాగ్స్ ని ఫ్రిజ్ లో పెట్టి కాస్త చల్లబడిన తర్వాత కళ్లపై పెట్టుకొని ఒక అరగంట పాటు రిలాక్స్ అవ్వాలి. ఇది మీ కళ్ల వాపు, నొప్పిని తొలగించేస్తుంది.
మాంసం రుచిని పెంచుతుంది.
మాంసం రుచిని పెంచడానికి మాంసం మారినేట్ చేసేటప్పుడు అందులో టీ బ్యాగ్స్ వేసి మారినేట్ చేసుకోవాలి. టీ బ్యాగ్స్ మాంసంతో చేసిన వంటకాలకు తీపి, ఉప్పు రుచిని అందిస్తుంది. ఇలా చేయడం వల్ల బీబీక్యూ చేసిన మాంసంలో మరింత రుచి పెరుగుతుంది.
చెక్క వస్తువులు పాలిష్ చేయడానికి..
చెక్కతో చేసిన వస్తువులన్నింటినీ మంచి మెరుపును తీసుకురావడానికి దాన్ని తరచూ పాలిష్ చేస్తూ ఉంటాం. కానీ అలా పాలిష్ చేసేందుకు వాడి పడేసిన టీ బ్యాగ్స్ ఉపయోగించవచ్చు. ఇందుకోసం వేడి నీటిలో ఈ టీ బ్యాగ్స్ వేసి దాన్ని వుడెన్ వస్తువుల పై దీన్ని వేసి మెత్తని క్లాత్ సాయంతో దాన్ని బాగా రుద్దాలి. ఇలా చేయడం వల్ల చెక్క వస్తువులకు చక్కటి షైనింగ్ వస్తుంది.
గ్లాస్ ని శుభ్రం చేయడం..
మీ గ్లాస్ అద్దాలు, కిటికీ గ్లాసెస్, ఇతర గ్లాస్ వస్తువులను శుభ్రం చేయడానికి వాటిని వాడి పడేసిన టీ బ్యాగ్స్ తో రబ్ చేయాలి. ఇలా చేయడం వల్ల అవి మెరుస్తాయి. దీని కోసం వాటిని తడి టీ బ్యాగ్ తో రుద్ది ఆ తర్వాత పొడి క్లాత్ తో రుద్దాలి. ఇది అద్దాలకు మంచి మెరుపును అందిస్తాయి.
మీ గార్డెన్ కి ఎరువు వేయండి.
టీ బ్యాగ్స్ లో ఉన్న మిశ్రమాన్ని నీటిలో కలిపి దాన్ని గార్డెన్ లోని మట్టిలో కలిపి ఉంచడం వల్ల ఇది మీ గార్డెన్ కి ఎరువుగా ఉపయోగించవచ్చు. దీనికోసం టీ బ్యాగ్స్ తొలగించి.. అందులోని టీ మిశ్రమాన్ని మొత్తం నీటిలో కలిపి మట్టిలో వేయాలి. దీంతో మొక్కలు ఆరోగ్యంగా పెరుగుతాయి
వాసన పోవడానికి కూడా వాడండి.
మీ చేతులకు ఉల్లిపాయ, వెల్లుల్లి, మాంసం వంటివి అంటుకొని ఆ వాసన పోవట్లేదా? అయితే మీరు వాడి పడేసిన టీ బ్యాగ్స్ తో ఈ వాసన తొలగించుకోవచ్చు. దీనికోసం రెగ్యులర్ హ్యాండ్ వాష్ కి బదులుగా టీ బ్యాగ్స్ లోని మిశ్రమాన్ని చేతుల్లో వేసుకొని కొద్దిగా సబ్బు మిశ్రమం కూడా కలిపి రుద్దుకోవాలి. దీనివల్ల చేతులకు ఉన్న వాసన పూర్తిగా తొలగిపోతుంది.
వెంట్రుకల షైనింగ్ పెంచుతుంది.
మీరు మీ వెంట్రుకలను మెరిపించేందుకు కూడా టీ బ్యాగ్స్ ని ఉపయోగించవచ్చు. ఇది మీ వెంట్రుకలకు షైనింగ్, మెత్తదనం, స్మూత్ నెస్ అందిస్తుంది. ఇందుకోసం మీ రెగ్యులర్ షాంపూకి ముందుగా టీ బ్యాగ్స్ ని వేడి నీటిలో వేసి ఆ మిశ్రమాన్ని తలకు పట్టించి ఆ తర్వాత షాంపూ చేసుకోవాలి.
https://krishijagran.com/news/no-stapler-pins-in-tea-bag-packaging-fssai/
Share your comments