Health & Lifestyle

ఆరోగ్యానికి చల్ల పాలు మంచివా.. లేక వేడి పాలు మంచివా?

KJ Staff
KJ Staff
Milk
Milk

సాధారణంగా మనం ప్రతిరోజు తీసుకునే వాటిలో పాలు ఒకటి. పాలలో ఎన్నో పోషకాలు ఉండటం వల్ల అనేక లాభాలు మన ఆరోగ్యానికి మంచివని భావిస్తాము.ఈ క్రమంలోనే కొందరు చల్లగా ఉండే పాలను తాగడానికి ఇష్టపడగా... మరికొందరు బాగా వేడిగా ఉన్న పాలను తాగడానికి ఇష్టపడతారు. అయితే మన ఆరోగ్యానికి చల్లని పాలు మంచివా లేక వేడి పాలు మంచివా అన్న సందేహం చాలామందికి కలుగుతుంది. అయితే మన శరీరానికి ఏ పాలు మంచివో ఇక్కడ తెలుసుకుందాం...

సాధారణంగా పాలల్లో అధిక మొత్తంలో ప్రొటీన్లు, కాల్షియం,విటమిన్-డి, పొటాషియం ఉంటాయి. ఇది మన ఆరోగ్యానికి ఎంతో మేలు కలిగిస్తాయి.అయితే చల్లని పాలు లేదా వేడి పాలలో ఈ విధమైనటువంటి పోషకాలు సమానంగా ఉంటాయి కనుక చల్లని పాలు తాగిన వేడి పాలు తాగిన మన శరీరానికి అన్ని పోషకాలు సమృద్ధిగా అందుతాయి.

వెచ్చని పాలను వేసవికాలంలో తాగ కూడదు. వేడి పాలు తాగడం వల్ల శరీరంలో అధిక ఉష్ణోగ్రత నమోదవుతుంది. అలాగే చలికాలంలో తప్పనిసరిగా రాత్రి సమయంలో వెచ్చని పాలను తాగాలి. వేడి పాలు తాగటం వల్ల మనం తీసుకున్న ఆహారం తేలికగా జీర్ణం అవుతుంది. అదేవిధంగా నిద్రలేమి సమస్యతో బాధపడేవారికి వేడిపాలు నిద్రను కలిగిస్తాయి.

చల్లని పాలలో కూడా మనకు క్యాల్షియం సమృద్ధిగా లభిస్తుంది. అలాగే కడుపులో అసిడిటీ వంటి సమస్యల నుంచి దూరం చేయడానికి చల్లని పాలు కీలకపాత్ర పోషిస్తాయి. అయితే రాత్రి పడుకునే సమయంలో చల్లటి పాలు తాగకూడదు అని నిపుణులు చెబుతున్నారు. పడుకునే ముందు చల్లని పాలు తాగటం వల్ల జీర్ణక్రియ సమస్యలను కలిగిస్తాయి. అదేవిధంగా దగ్గు రావడానికి కూడా ఈ చల్లటి పాలు కారణమవుతాయి కనుక రాత్రి పడుకునే ముందు చల్లటి పాలు తాగకూడదుని కేవలం పాలు మాత్రమే తాగాలని నిపుణులు చెబుతున్నారు.

Share your comments

Subscribe Magazine