Success Story

ఆయుర్వేద ఉత్పత్తులు.. నెలకు 5 లక్షల ఆదాయం..

KJ Staff
KJ Staff

మహిళలు ప్రస్తుతం పురుషులతో సమానంగా అన్ని రంగాల్లో అద్భుతంగా రాణిస్తున్నారు. ఆడవారిని కేవలం వంటింటికి పరిమితం చేసే రోజులు పోయాయి. ఆడవారు ఉద్యోగ మరియు వ్యాపార రంగాల్లో కూడా విజయాలు సాధిస్తున్నారు. విజయ మహదేవన్ అనే 45 ఎళ్ల మహిళా వ్యవసాయ రంగంలో ఎన్నో అద్భుతాలు చేస్తున్నారు. ఈ మహిళా తమిళనాడు రాష్ట్రానికి చెందినవారు. ఈ మహిళా ఆయుర్వేద ఉత్పత్తులను తయారుచేస్తూ భారీగా ఆదాయాన్ని సంపాదిస్తున్నారు. ఈ మహిళా మరో 15 మందికి ఉపాధి కల్పిస్తున్నారు. ఈమె స్వస్థలం వచ్చేసి తంజావూరులోని శ్రీనివాసపురం. ఈమె బిఎ వరకు చదువుకున్నారు.

చాలా రోజుల పాటు గృహిణిగానే ఉన్నారు. ఐతే సొంతంగా ఏదైనా చేయాలన్న ఆలోచన రావడంతో.. ఆమె కుమారుడు ఆయుర్వేద ఉత్పత్తుల గురించి వివరించాడు. వాటికి డిమాండ్ ఎక్కువగా ఉందని.. అందులో వ్యాపారం చేస్తే.. మంచి లాభాలు ఉంటాయని చెప్పాడు. విజయకు అప్పటికే ఆయుర్వేదంపై పట్టుంది. తమ కుటుంబం కోసం పలు రకాల ఉత్పత్తులను తయారు చేసేవారు.
అనంతరం 2017లో మొదట ఆయుర్వేదిక్ టూత్ పొడి ఉత్పత్తి ప్రారంభించారు.

విజయ మహదేవన్ విశికర వేద అనే పేరుతో ఇంస్టాగ్రామ్ అకౌంట్ తయారు చేసి దాని ద్వారా వారి ఉత్పతులను ప్రచారం చేస్తున్నారు. మొదటిలో పెద్దగా స్పందన రాలేదు. రాను రాను వారి ఆయుర్వేదిక్ టూత్ పౌడర్ గురించి ప్రచారం పెరగడంతో.. బిజినెస్ పెరిగింది. ఆర్డర్‌లు ఎక్కువగా వచ్చాయి. టూత్ పౌడర్ సక్సెస్ కావడంతో.. మరిన్ని ఆయుర్వేద ఉత్పత్తులను తయారు చేయాలనుకున్నారు. అలా.. ఇప్పుడు చాలా రకాల ఉత్పత్తులను విక్రయిస్తున్నారు. ఆయుర్వేద టూత్ పౌడర్‌తో పాటు ఎనిమిది రకాల ఫేసియల్స్, కొబ్బరినూనె, కరివేపాకు పొడి, అలోవెరా జెల్, హెయిర్ ఆయిల్ వంటివి ఉత్పత్తి చేస్తున్నారు. ఇంట్లో సహజసిద్ధమైన వేరుశెనక నూనె, కొబ్బరినూనె, ఆయుర్వేదిక్ బేబీ ఉత్పత్తులను సైతం విక్రయిస్తున్నారు. వీటిని ఇండియా నలుమూలలతో పాటు విదేశాలకు కూడా ఎగుమతి చేస్తున్నారు. మార్కెటింగ్ అంతా సోషల్ మీడియా ద్వారానే జరుగుతోంది.

ఇది కూడా చదవండి..

మిల్లెట్ సాగుతో కోట్లలో టర్నోవర్ -రైతు కెవి రామ సుబ్బా రెడ్డి విజయకథ

ఆయుర్వేద ఉత్పతులు తయారు చేయడం అంత సులువు కాదు. అన్ని ముడి సరుకులు ప్రతి సీసన్ లో దొరకవు. అవికూడా కొన్ని పేరెంత;ల్లో మాత్రమే దొరుకుతాయి. ఆలా దొరికినప్పుడే పెద్దమొత్తంలో సేకరించుకుని ఉత్పత్తులను తయారు చేస్తామని ఆమె తెలిపారు. మందార టీ పొడి , మందార ఫేస్ ప్యాక్, ఇతర మందార ఆయుర్వేద ఉత్పత్తులను తయారు చేయడానికి.. తాము 3 ఎకరాల భూమిలో 3,500 మందార, గులాబీ మొక్కలను పెంచుతున్నామని విజయ తెలిపారు. చుట్టు పక్కల గ్రామాలకు చెందిన మరో 15 మంది మహిళలకు విజయ మహదేవన్ ఉపాధి కల్పించారు. వారికి ఉద్యోగ భద్రతతో పాటు మంచి జీతం ఇస్తున్నారు. ప్రతి నెలా రూ.5లక్షల వరకు ఆదాయం సంపాదిస్తున్నారు. ముడిసరుకు, సిబ్బంది జీతాలు, ఇతర ఖర్చులు పోనూ.. ప్రతి నెలా ఆమెకు రూ.3 లక్షల నికర లాభం వస్తోంది.

ఇది కూడా చదవండి..

మిల్లెట్ సాగుతో కోట్లలో టర్నోవర్ -రైతు కెవి రామ సుబ్బా రెడ్డి విజయకథ

Related Topics

ayurvedhic products

Share your comments

Subscribe Magazine

More on Success Story

More