Success Story

హ్యాట్సఫ్ రైతన్నా.. నీకు సలాం

KJ Staff
KJ Staff

మట్టిని నమ్ముకుని వ్యవసాయం చేసే రైతులు చాలాలమంది ఉంటారు. వారికి వ్యవసాయమే జీవనాధారం. ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్నిక కష్టాలు వచ్చినా సరే వ్యవసాయాన్ని అసలు వదిలిపెట్టరు.

అప్పులు చేసి వ్యవసాయం చేస్తూ ఉంటారు. వ్యవసాయాన్ని వారసత్వంగా భావించే వారు కూడా చాలామంది ఉంటారు. ఎన్ని తరాలు మారినా వ్యవసాయాన్ని నమ్ముకుని చాలా కుటుంబాలు జీవిస్తున్నాయి. ఎన్ని ఆర్థిక ఇబ్బందులు వచ్చినా సరే.. వ్యవసాయాన్ని నమ్ముకుని జీవనం కొనసాగిస్తున్నారు.

ఇప్పుడు అలాంటి ఒక రైతు కథ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఇప్పుడు రియల్ ఎస్టేట్ రంగం పెరిగిపోవడంతో.. వ్యవసాయ సాగు భూములు రియల్ ఎస్టేట్ భూములుగా మారుతున్నాయి. పచ్చని పంట పండే వ్యవసాయ భూములను రియల్ ఎస్టేట్ భూములుగా మార్చి వ్యాపారం చేస్తున్నారు. కొంతమంది రైతులు కూడా ఆర్థిక ఇబ్బందుల వల్ల తమ భూములను రియల్ ఎస్టేట్ వ్యాపారులకు విక్రయిస్తున్నారు.

ఇక ఆధునీకత పెరుగుతున్న నేపథ్యంలో రోడ్లను, ఎయిర్ పోర్టులు, ప్రాజెక్టులు కట్టేందుకు భూసేకరణ పేరుతో పచ్చని పోలాలను ప్రభుత్వాలు తీసుకుంటున్నాయి. దీంతో రైతులకు జీవనాధారం లేకుండా పోతోంది. అయితే జపాన్‌కి చెందిన టకావో షిటో అనే రైతు మాత్రం తమ భూమిని ఎయిర్ పోర్టుకు ఇవ్వకుండా వ్యవసాయం చేస్తున్నాడు. ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు పక్కనే వ్యవసాయం చేస్తూ అందరికీ స్పూర్తిగా నిలుస్తున్నాడు.

విమానం ధ్వనుల మధ్య ఎయిర్ పోర్టు రన్ వేకు అనుకుని ఉన్న పోలంలో వ్యవసాయం చేస్తున్నాడు. జపాన్ లోని న్యూ టోక్యో ఎయిర్‌పోర్టు నిర్మాణం కోసం 1960లో జపాప్ ప్రభుత్వం భూసేకరణ చేపట్టింది. అయితే అక్కడ ఉన్న సరిత అనే గ్రామం ప్రజలు తమ వ్యవసాయ భూములను ఇచ్చేందుకు నిరాకరించారు. కొంతమంది ప్రభుత్వం ఇచ్చిన డబ్బులు తీసుకుని నగరాలకుక వెళ్లిపోయారు.

అయితే భూములను ఇవ్వమని వ్యతిరేకిస్తూ అప్పట్లో షిటో తండ్రి పెద్ద ఉద్యమం చేపట్టారు. ఎన్ని కోట్లు ఇచ్చినా.. తన భూమిని విక్రయించనని తేల్చిచెప్పారు. దీంతో జపాన్ ప్రభుత్వం ఈ భూమిని వదిలేసి ఎయిర్ పోర్ట్ నిర్మించింది. దీంతో తండ్రి ఆశయాలను కొనసాగిస్తూ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు రన్ వేకు అనుకుని ఉన్న పోలంలో షిటో కూరగాయలు, పండ్లు పండిస్తున్నాడు.

Share your comments

Subscribe Magazine

More on Success Story

More