Animal Husbandry

ఇప్పుడు పశువులకూ కూడా ఆధార్‌ కార్డు .. త్వరలో అమల్లోకి !

Srikanth B
Srikanth B

ఇప్పటివరకు పశువులకు ఆధార్ కార్డు అనేది అందరు ఒక ఎగతాళిగా ఉపయోగించే వారు అయితే ఇప్పుడు ఆ ఎగతాళి నిజం అయ్యే రోజులు దగ్గర్లోనే ఉన్నాయి . దేశంలో ఈమేరకు త్వరలో పశువులకు కూడా ఆధార్‌ కార్డు ఇవ్వనున్నట్టు నీతి ఆయోగ్‌ సభ్యుడు వీకే పాల్‌ తెలిపారు .

పశువులకు ఏదైనా వ్యాధి సోకినప్పుడు దానియొక్క పుట్టు పూర్వోత్తరాలకు సంబందించిన పూర్తి సమాచారం , గతంలో ఏ వ్యాధికి పశువు గురైందో తెలుసుకోవడానికి మరియు పశువుకు సంబందించిన అన్ని రకాల డేటా ను భద్ర పరచాడనికి ఈ ఆధార్ కార్డు ఉపయోగపడనునట్లు నీతి ఆయోగ్‌ సభ్యుడు వీకే పాల్‌ తెలిపారు .

యాసంగి :తెలంగాణ లో 53 లక్షల ఎకరాలలో వరి సాగు .. సాగులో టాప్ జిల్లాకు ఇవే!

వ్యాధి పుట్టుక గురించి వీలైనంత త్వరగా తెలుసుకోవాలని అప్పుడే దాని నివారణకు వ్యాక్సిన్‌ను, ఇతర మార్గాలను అన్వేషించడం సులభమవుతుందని అన్నారు. బయో ఏషియా సదస్సులో భాగంగా మొదటి రోజు ప్యానల్‌ డిస్కషన్‌లో 'వన్‌ హెల్త్‌ అప్రోచ్‌, స్వదేశీ పరిజ్ఞానం, విధానం' అంశంపై చర్చ నిర్వహించారు. దీనికి సీఎంసీ వెల్లూరు ప్రొఫెసర్‌ డాక్టర్‌ గగన్‌దీప్‌ కంగ్‌ సమన్వయకర్తగా వ్యవహరించారు. ఈ సందర్భంగా వీకే పాల్‌ మాట్లాడుతూ.. మనుషులకు ఇచ్చినట్టుగానే పశువులకు పశు ఆధార్‌ను రూపొందించామని చెప్పారు. త్వరలో ప్రతి పశువు, జంతువుకు ఆధార్‌ నంబర్‌ ఇవ్వనున్నామని తెలిపారు. దీని ద్వారా దేశంలో పశువులు, జంతువుల వివరాలు సులభంగా లభ్యమవుతాయన్నారు. ఆ తరువాత ఆ వివరాలను డిజిటలైజ్‌ చేస్తామని చెప్పారు.

యాసంగి :తెలంగాణ లో 53 లక్షల ఎకరాలలో వరి సాగు .. సాగులో టాప్ జిల్లాకు ఇవే!

Related Topics

Pashu Credit Card

Share your comments

Subscribe Magazine

More on Animal Husbandry

More