Animal Husbandry

రైతుల ఇంటి వద్దకే వెటర్నరీ సేవలు: కేంద్ర మంత్రి పర్షోత్తం రూపాలా

Srikanth B
Srikanth B
Veterinary services at farmers' doorsteps
Veterinary services at farmers' doorsteps

జంతువులకు వైద్యం చేసేందుకు రైతుల ఇంటి వద్దకే పశువైద్యుల సేవలను అందుబాటులోకి తెస్తామని కేంద్ర మత్స్య, పశుసంవర్ధక, పాడిపరిశ్రమ అభివృద్ధి శాఖ మంత్రి పర్షోత్తం రూపాలా తెలిపారు. తిరువనంతపురంలో 29 మొబైల్ వెటర్నరీ యూనిట్లను కేంద్ర మంత్రి జెండా ఊపి ప్రారంభించారు. 1962 నంబరుకు కాల్ దూరంలో సుసంపన్నమైన వెటర్నరీ సౌకర్యాలు అందుబాటులో ఉంటాయని ఆయన తెలిపారు. ఈ MVలు రాష్ట్రంలోని ప్రతి మూలకు చాలా త్వరగా చేరుకోగలవని శ్రీ రూపాల చెప్పారు.

 

 

ఈ విధానం పాడి రైతులకు అధిక దిగుబడినిచ్చే పాల ఉత్పత్తులను అభివృద్ధి చేసేందుకు విశ్వాసాన్ని పెంచుతుంది. పశువుల పెంపకందారులకు ప్రత్యేక సేవలు అందించేందుకు ప్రతి ఎంవీయూవీలో ఒక పశువైద్యుడు, సహాయకుడు ఉంటారని మంత్రి తెలిపారు. జంతువుల ప్రసవ అవసరాలకు కూడా ఇది ఉపయోగపడుతుందని ఆయన అన్నారు.

పాడిపరిశ్రమను జీవనాధారమైన వ్యవసాయ రంగం నుంచి వాణిజ్యపరంగా లాభదాయకమైన సంస్థగా మార్చేందుకు ఈ ప్రాజెక్టు దోహదపడుతుందని.. దేశ యువతకు లాభదాయకమైన ఉపాధి అవకాశంగా నిలుస్తుందని, యువత ఈ రంగంలోకి వచ్చేలా ప్రోత్సహిస్తామన్నారు.

ఆవు పై ఆత్యాచారం .. సమాజం సిగ్గు పడే ఘటన ..

హెల్ప్‌లైన్ నంబర్ 1962తో కేంద్రీకృత కాల్ సెంటర్‌ను విదేశాంగ మరియు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి శ్రీ వి మురళీధరన్ ప్రారంభించారు. పశుపోషణ, డెయిరీ అభివృద్ధిలో రాష్ట్రం స్వయం సమృద్ధి సాధించేందుకు కేంద్ర చర్యలు దోహదపడతాయన్నారు.

ఈ కార్యక్రమానికి రాష్ట్ర పశుసంవర్ధక మరియు పాడిపరిశ్రమ అభివృద్ధి శాఖ మంత్రి శ్రీమతి జె.చించు రాణి అధ్యక్షత వహించారు. పశువుల ఆరోగ్యం, వ్యాధుల నియంత్రణ పథకం, రాష్ట్రీయ గోకుల్ మిషన్ వంటి అనేక కేంద్ర పథకాలను రాష్ట్రం అమలు చేస్తోందని ఆమె తెలిపారు.

కేరళలో నిర్వహించిన కార్యక్రమానికి అక్కడి స్థానిక ప్రతినిధులు మరియు డైరీ రైతులు హాజరయ్యారు .

ఆవు పై ఆత్యాచారం .. సమాజం సిగ్గు పడే ఘటన ..

Related Topics

Dairy dairy cattle

Share your comments

Subscribe Magazine

More on Animal Husbandry

More