Animal Husbandry

శీతాకాలంలో దూడల పెంపకం మరియు యాజమాన్య పద్ధతులు..

Gokavarapu siva
Gokavarapu siva

పశువుల యొక్క జీవితంలో మొదటి మూడు నెలలు చాలా ముఖ్యమైనవి. ఈ కాలంలో పశువులను చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ముఖ్యంగా శీతాకాలంలో ఇంకా అవసరం. రైతులు మరియు డైరీ-ఫార్మ్‌ యజమానులు దూడలు పుట్టిన మొదట కొన్ని రోజులు వాటి సంరక్షణకు తగిన మెళకువలను పాటిస్తూ వాటిని జాగ్రత్తగా చూసుకోవలసిన అవసరం ఉంది. వాటి ఆరోగ్యం సరిగ్గా ఉంటేనే భవిష్యత్తులో వాటిలో పాల ఉత్పత్తి సరిగ్గా ఉంటుంది.

దూడలు పుట్టిన మొదటి మూడు నెలలు వాటిలో వ్యాధి నిరోధక శక్తి చాలా తక్కువగా ఉంటుంది, కాబట్టి దూడలలో రోగ నిరోధక శక్తి పెంచడానికి మరియు శారీరక ఎదుగుదల కొరకు వాటికి ఎక్కువ శక్తీ కావలి. శీతాకాలంలో దూడల శరీర ఉష్ణోగ్రత కాపాడుకోవడానికి అధిక శక్తీ అవసరం ఉంటుంది. కాబట్టి దూడల శరీరం నుండి చీలి బయటకు పోకుండా యజమానులు చూసుకోవాలి. సుమారుగా వాటి యొక్క శరీర ఉష్ణోగ్రత అనేది 38.50 సెంటిగ్రేడ్‌ ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి.

ఒకవేళ దూడలు చలి ప్రభావానికి గురైతే కనుక వాటికి సులువుగా న్యూమోనియా, ధనుర్వాతం వంటి రోగాల బారిన పడే అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి పాడిరైతులు శీతాకాలంలో ఈ యాజమాన్య పద్దతులను పాటించి వాటి యొక్క మరణాలను తగ్గించి, వాటిని కాపాడుకోవచ్చు.

ఇది కూడా చదవండీ..

రాష్ట్రంలో ఆర్బికేల ద్వారా పశు వైద్యసేవలు

పశువులకు ప్రసవానికి 2-3 నెలల ముందుగానే అధిక పోషకాలు ఉన్న ఆహారాన్ని వాటికి మేతగా పెట్టాలి. ఇలా చేయడం వలన పుట్టబోయే దూడలో శక్తీ పెరుగుతుంది. అప్పుడే దూడకు జన్మనిచ్చిన ఆవు నుండి 2 గంటల లోపే పాలను సేకరించి దూడలకు ఇవ్వాలి. ఈ పాలలో అధిక పోషకాలు మరియు వ్యాధి నిరోధక శక్తి పెంచే ప్రతి రక్షకాలు అధికంగా ఉంటాయి. దీనితో దూడలలో రోగ నిరోధక శక్తీ పెరుగుతుంది. అప్పుడే పుట్టిన దూడలకు ముర్రు పాలను రోజులో ఎక్కువసార్లు అందించడం ద్వారా శక్తిని ఉత్పత్తి చేయడానికి ముఖ్యంగా కావాల్సిన క్రొవ్వులు అధిక మోతాదులో చేకూరే అవకాశం ఉంటుంది.

దూడలకు చలి గాలి తగలకుండా వాటిని నాలుగు వైపులా మూసి ఉండి, గాలి ప్రసరణకు ఆటంకాలు లేని గదులలో ఉంచాలి. గదిలో ఉష్ణోగ్రతలను పెంచడానికి నేలపై గడ్డిని మందంగా పరచాలి. దూడ శరీర ఉష్ణోగ్రత ఎట్టి పరిస్థితులలో కూడా 37.7 డిగ్రీల సెంటిగ్రేడ్‌ తగ్గకుండా చూసుకోవాలి. దూడలను శరీరాన్ని గడ్డితో కప్పడం వలన దూడ దేహం నుండి వేడిని త్వరితగతిన కోల్పోకుండా నివారించవచ్చు. అయితే ఎప్పటికప్పుడు శుభ్రమైన వస్త్రంతో దూర శరీరం పొడిగా ఉండేటట్లు తుడవాలి.

ఇది కూడా చదవండీ..

రాష్ట్రంలో ఆర్బికేల ద్వారా పశు వైద్యసేవలు

Related Topics

winter season calf

Share your comments

Subscribe Magazine

More on Animal Husbandry

More