Education

నవంబర్ 14 బాలల దినోత్సవం రోజు ,మనం తెలుసుకోవాల్సిన బాలల హక్కులు ఇవే .. !

Srikanth B
Srikanth B
నవంబర్ 14 బాలల దినోత్సవం రోజు ,మనం తెలుసుకోవాల్సిన బాలల హక్కులు ఇవే .. !
నవంబర్ 14 బాలల దినోత్సవం రోజు ,మనం తెలుసుకోవాల్సిన బాలల హక్కులు ఇవే .. !


ప్రతి ఏటా నవంబర్ 14 న దివంగత భారత దేశ తొలి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ జయంతి సందర్భముగా , అయన పిల్లల పై చూపిన ప్రేమకు గుర్తుగ జాతీయ బాలల దినోత్సవం జరుపుకుంటాం.

అసలు బాలల దినోత్సవం ఎందుకు జరుపుకుంటాం?

నెహ్రూకి జయంతిని పురస్కరించుకొని చిల్డ్రన్స్ డే గ నవంబర్ 14 ను జరుపుకుంటారు.నెహ్రు కు మరో పేరు 'చాచా నెహ్రూ' ,నెహ్రూ నవంబర్ 14, 1889న అలాహాబాద్ , ఉత్తరప్రదేశ్ రాష్ట్రము లో జన్మించారు . పిల్లల పై తనకున్న అభిమానానికి నిదర్శనమే 1955లో పిల్లల కోసం ప్రత్యేకంగా దేశీయ సినిమాలను రూపొందించడానికి చిల్డ్రన్స్ ఫిల్మ్ సొసైటీ ఇండియాను స్థాపించడం .అంతేకాకుండా అయన పిల్లల కోసం అనేక సేవలు చేసారు .

బాలల దినోత్సవాన్ని ఎప్పటి నుంచి ప్రారంభమైనది ?

1964కి ముందు భారతదేశం నవంబర్ 20న పరార్పంచ బాలల దినోత్సవం సందర్భంగానే జరుపుకునేది అయితే 1964లో పండిట్ నెహ్రూ మరణించిన తర్వాత ఆయన జయంతిని బాలల దినోత్సవంగా జరుపుకోవాలని నిర్ణయించారు.
నెహ్రూ సమర్ధవంతమైన ఎంతో దూర దృష్టి కల్గిన నాయకుడు కావడం వల్లనే నేడు సమానం అనేక ప్రపంచ ప్రఖ్యాత
విశ్వవిద్యాలయాలను భారత దేశం లో చూస్తున్నాం . అందుకు ఉదాహరణయే AIIMS, IIT మరియు IIM లను స్థాపించి భారతీయ విద్యను బలోపేతం చేయడం లో దోహదపడ్డాడు . నెహ్రూ భారతదేశపు పిల్లలకు విద్యా వారసత్వాన్ని మిగిల్చారు."నేటి పిల్లలు రేపటి భారతదేశాన్ని తయారు చేస్తారు. వారిని మనం పెంచే విధానం దేశ భవిష్యత్తును నిర్ణయిస్తుంది" అని ఆయన అనేక సార్లు తన ప్రసంగాలలో తెలిపేవారు .

నవంబర్ 11 జాతీయ విద్య దినోత్సవం థీమ్ ఏంటో తెలుసా !

నెహ్రూను 'చాచాజ్' అని ఎవరు పిలిచారు?

నెహ్రూను 'చాచాజీ' అని పిలవడానికి అతనికి పిల్లలపై ఉన్న ప్రేమ ప్రధాన కారణమని చెప్పబడింది. మరొక విషాయం ఏమిటంటే, నెహ్రూ తన అన్నయ్యగా భావించే మహాత్మా గాంధీకి చాలా సన్నిహితుడు. గాంధీని 'బాపు'గా పిలుచుకుంటే, నెహ్రూకు 'చాచాజీ' అనే పేరు వచ్చింది.



భారత రాజ్యాంగం ప్రకారం, బాలల హక్కులు:


6-14 సంవత్సరాల వయస్సు గల పిల్లలందరికీ ఉచిత మరియు నిర్బంధ ప్రాథమిక విద్య హక్కు
ఏదైనా ప్రమాదకరమైన ఉపాధి నుండి రక్షించబడే హక్కు
బాల్య సంరక్షణ మరియు విద్య హక్కు
వెట్టి చాకిరీ నుంచి విముక్తి పొందే హక్కు'
వయస్సు తో సంబంధంలేని సరిపోని వృత్తులలోకి ప్రవేశించే ఆర్థిక అవసరం నుండి రక్షించబడే హక్కు
ఆరోగ్యకరమైన రీతిలో అభివృద్ధి చెందడానికి సమాన అవకాశాలు మరియు సౌకర్యాల హక్కు
స్వేచ్ఛ మరియు గౌరవం హక్కు మరియు దోపిడీకి వ్యతిరేకంగా బాల్యం మరియు యువత రక్షణ హామీ

బాలల దినోత్సవం 1857లో USలోని చెల్సియాలో రెవరెండ్ డాక్టర్ చార్లెస్ లియోనార్డ్ ద్వారా ప్రారంభమైంది. ప్రపంచంలోని చాలా దేశాలు జూన్ 1న బాలల దినోత్సవాన్ని జరుపుకుంటున్నప్పటికీ, సార్వత్రిక బాలల దినోత్సవం ఏటా నవంబర్ 20న జరుగుతుంది.

నవంబర్ 11 జాతీయ విద్య దినోత్సవం థీమ్ ఏంటో తెలుసా !

Share your comments

Subscribe Magazine