Education

తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్ లో 3966 ఖాళీల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ..

Srikanth B
Srikanth B
TSPLRB Notification
TSPLRB Notification

తెలంగాణాలో ఉద్యోగాల జాతర కొనసాగుతుంది అనడానికి మరొక నిదర్శనం.. తాజాగా పోలీస్ శాఖలో మరో 3966 కొత్త పోస్టుల భర్తీకి తెలంగాణ మంత్రివర్గం నుంచి ఆమోదం లభించడమే , ఈ పోస్టులు అన్ని హైదరాబాద్ కమిషనరేటే పరిధిలోనివి గత కొన్ని సంవత్సరాలుగు ఖాళీలుగా ఉన్న ఈ పోస్టు ల భర్తీకి రాష్ట్ర హోంశాఖను కేబినెట్ ఆదేశించింది.

 

పెరుగుతున్న సాంకేతికత సహాయంతో రాష్ట్రము లో శాంతి భద్రతలను కాపాడడానికి ప్రభుత్వం , నార్కోటిక్ డ్రగ్స్, గంజాయి తదితర మాదక ద్రవ్యాలు యువత భవిష్యత్ ను దెబ్బతీస్తూ శాంతిభద్రతల సమస్యగా పరిణమిస్తున్నాయనీ, క్యాబినేట్ చర్చించింది. డ్రగ్స్ నేరాలను అరికట్టి నిర్మూలించేందుకు హైదరాబాద్ , సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్లు, కమాండ్ కంట్రోల్ సెంటర్, నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో మరియు తెలంగాణ సైబర్ సేఫ్టీ బ్యూరో పరిధిలో 3,966 పోస్టులను వివిధ కేటగిరీలలో భర్తీ చేయాలని క్యాబినేట్ నిర్ణయించింది. దీనికి సంబందించిన 3,966 ఖాళీలను భర్తీ చేయనుంది మంత్రి వర్గం ఆమోదం తెలిపింది .

TSPSC :1392 జూనియర్ లెక్చరర్ పోస్టులకు నోటిఫికేషన్ .. డిసెంబర్ 16 నుంచి దరఖాస్తుల స్వీకరణ !

హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ల పరిధిలో.. శాంతిభద్రతలను మరింతగా మెరుగు పరిచేందుకు, పోలీసు వ్యవస్థను మరింత పటిష్టం చేయడానికి, నూతన పోలీస్ స్టేషన్లు, నూతన సర్కిల్ లు, నూతన డివిజన్ల ఏర్పాటుకు కూడా క్యాబినేట్ ఆమోదం తెలిపింది.


అదేవిధముగా డిసెంబర్ నెలలో తెలంగాణ నిరుద్యోగులు మరిన్ని శుభవార్తలు వినే అవకాశం వుంది . ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం వరుసగా గ్రూప్ 1 , గ్రూప్ 4 నోటిఫికేషన్ లను విడుదలచేసింది . అదే క్రమంలో డిసెంబర్ మూడవ వారం లో గురుకులాల్లో 12000 ఖాళీలను భర్తీచేయనుంది . 9,096 పోస్టుల భర్తీకి గతంలోనే ఆమోదం లభించింది దీనికి తోడు మరో 3000 ఖాళీలకు భర్తీకి కూడా ముఖ్యమంత్రి సంతకం చేశారు దీనితో మొత్తం 12000 పోస్టుల భర్తీకి ప్రభుత్వం సిద్ధం అవుతుంది . ఈ మేరకు గురుకుల విద్యా సంస్థల నియామకాల బోర్డు (టీఆర్‌ఈఐఆర్‌బీ) చర్యలు చేపట్టింది. ఈ నెల మూడో వారంలోగా నోటిఫికేషన్లు విడుదల కానున్నట్టు ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి.

TSPSC :1392 జూనియర్ లెక్చరర్ పోస్టులకు నోటిఫికేషన్ .. డిసెంబర్ 16 నుంచి దరఖాస్తుల స్వీకరణ !

Related Topics

TSPSC GROUP 1 TSPLRB

Share your comments

Subscribe Magazine