Health & Lifestyle

ఈ వేసవికాలంలో మీ శరీర ఆరోగ్యం కోసం దీనిని ఇప్పుడే డైట్‪లో చేర్చేసుకోండి..

Gokavarapu siva
Gokavarapu siva

మనం వేసవి కాలంలోకి అడుగు పెట్టేశాం. వేసవికాలంలో ఉష్ణోగ్రతలు ఆకాశాన్ని అంటుతాయి. ఈ వేసవికాలంలో ప్రజలు అందరూ ఆహర విషయాలలో చాలా జాగ్రత్త వహించాలి. ముఖ్యంగా నీటి శాతం ఎక్కువ ఉన్న ఆహారాన్ని తీసుకోవాలి. ఎందుకంటే ఈ ఎండలకు మన శరీరం నుండి చెమట రూపంలో ఎక్కువ శాతం నీరు అనేది బయటకి పోతుంది. కాబట్టి ఎక్కువగా ద్రవ పదార్ధాలను తీసుకోవాలి.

ఈ వేసవికాలంలో మన ఆరోగ్యానికి మేలు చేసే ఆహార పదార్ధాల్లో ఈ కీరదోస కూడా ఒకటి. ఈ కీరదోసలో ఎక్కువ శాతం నీరును కలిగిఉంటుంది. కాబట్టి ఈ కీరదోసను వేసవిలో తీసుకోవడం వలన మన శరీరం కోల్పోయిన నీటిని అందించడంలో సహాయపడుతుంది. మరియు మన శరీరాన్ని చల్లబరుస్తుంది. ఈ కిరదోసలో మనకు విటమిన్ ఏ, విటమిన్ సీ మరియు విటమిన్ కే అనేవి మనకు పుష్కలంగా లభిస్తాయి.

సుమారుగా కీరదోస 95%శాతం నీరును కలిగి ఉంటుంది. ఎక్కువ శాతం నీరు ఉన్నందున ఇవి మన శరీరంలో ఉన్న టాక్సిన్స్ ను తొలగిస్తుంది. మరియు శరీర వ్యర్ధాలను కూడా తొలగిస్తుంది. ఈ కీరదోసను ఎక్కువగా వేసవిలో తినడంవలన కలిగే ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

ఇది కూడా చదవండి..

వేసవిలో శరీర ఆరోగ్యం కొరకు తీసుకోవలసిన సహజ పానీయాలు..

ఈ కీరదోసలో కుకుర్బిటాసిన్ బీ అనే సహజ పదార్ధాన్ని కలిగి ఉటుంది. దీనివలన మన శరీరంలోని మానవ కణాలకు క్యాన్సర్ నిరోధక సామర్థ్యాన్ని అందిస్తుంది. దానితోపాటు ఈ కీరదోస తినడం ద్వారా మలబద్ధకాన్ని తగ్గించుకోవచ్చు, ఎందుకంటే వీటి తొక్కలో ఎక్కువ శాతం ఫైబర్ ఉంటుంది. కీరదోసలో విటమిన్ సి, కెఫిక్ యాసిడ్ సమృద్ధిగా ఉండటం వల్ల చికాకు పడిన చర్మం లేదా టాన్డ్ స్కిన్‌కు ఉపశమనం కలిగిస్తుంది. అలాగే వాపును తగ్గిస్తుంది. దోసకాయలో ఉండే ఆస్ట్రింజెంట్ ప్రాపర్టీ స్కిన్ ట్యాన్‌ని తగ్గించడంలో కూడా సహాయపడుతుంది.

ఈ కీరదోసలో విటమిన్ కే తో పాటు మెగ్నీషియం, పొటాషియం కూడా ఎక్కువ శాతంలో ఉంటాయి. ఈ పొటాషియం అనేది మన శరీరంలో రక్తపోటును నియంత్రిచడంలో సహాయపడుతుంది. ఈ కీరదోసకాయ మన చర్మానికి కూడా చాలా మేలు చేస్తుంది. ఈ విధంగా ఈ కీరదోసతో మనకు అనేక ఉపయోగాలు ఉన్నాయి. కనుక వెంటనే ఈ కీరదోసను మీ డైట్‪లో చేర్చేసుకోండి.

ఇది కూడా చదవండి..

వేసవిలో శరీర ఆరోగ్యం కొరకు తీసుకోవలసిన సహజ పానీయాలు..

Related Topics

Cucumber health benefifts

Share your comments

Subscribe Magazine