Health & Lifestyle

వేసవి లో తాటి ముంజలు తినడం ద్వారా కలిగే ప్రయోజనాలు ..!

Srikanth B
Srikanth B

వేసవిలో పల్లెటురిలలో అధికంగా కనిపించే తాటి ముంజలు తీసుకోవడం ద్వారా కల్గి ప్రయోజనాలు తెలిస్తే అస్సలు వదలరు .. కేవలం ఎండా కాలంలో మాత్రమే లభించే ఈ తాటి ముంజలు వేసవి వడదెబ్బ నుంచి రక్షిండానికి అద్భుతంగా పని చేస్తాయి , యే వయస్సు వారైనా తినదగినవి .

తాటి ముంజల్లో లభించే పోషకాలు :

తాటి ముంజల్లో విటమిన్‌ బి, ఐరన్‌, కాల్షియం, సి,ఎ.విటమిన్లు, జింకు పాస్పరస్‌, పొటాషియం, ధయామిన్‌, రిబో ప్లేవిస్‌, నియాసిస్‌ వంటి బీ కాంప్లెక్స్‌ వంటి అనేక పోషకాలు ఉంటాయి. మూడు తాటి ముంజలు ఒక కొబ్బరి బొండంతో సమానమని నిపుణులు చెప్పుతున్నారు.

ఎండాకాలంలో మన శరీరంలో నీరు వేగంగా ఖర్చవుతుంది. ఈ క్రమంలో మనం డీహైడ్రేషన్ బారిన పడతాం. అయితే అలాంటి పరిస్థితిలో తాటి ముంజలను తింటే శరీరంలోకి ద్రవాలు వచ్చి చేరతాయి. డీహైడ్రేషన్ బారి నుంచి బయట పడవచ్చు. జీర్ణ సంబంధ సమస్యలు తొలగిపోతాయి. గ్యాస్‌, అసిడిటీ, మలబద్దకం వంటి సమస్యలు తొలగిపోయి తీసుకున్న ఆహారం బాగా జీర్ణం అవుతుంది.

Big News :పాన్ ఆధార్ లింకింగ్ గడువు జూన్ 30 వరకు పొడగింపు ..!

అరటిపండులో ఎంత పొటాషియం ఉంటుందో తాటి ముంజులలో కూడా అంతే మొత్తంలో పొటాషియం ఉంటుంది. అందువల్ల తాటి ముంజలను తినటం వలన రక్త సరఫరా మెరుగుపడి రక్తపోటు కంట్రోల్ లో ఉంటుంది. దాంతో గుండె జబ్బుల ప్రమాదం కూడా తగ్గుతుంది. శరీరంలో చెడు కొలెస్ట్రాల్ తొలగిపోయి మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది.

Big News :పాన్ ఆధార్ లింకింగ్ గడువు జూన్ 30 వరకు పొడగింపు ..!

Related Topics

Healthtips

Share your comments

Subscribe Magazine