Health & Lifestyle

దిగులుగా ఉందా ?మీ మానసిక ఆనందాన్ని ఇలా పెంచుకోండి.

KJ Staff
KJ Staff

మన జీవితకాలంలో ఏదో ఒక సమయములో మనం దిగులు లేదా నిరాశకు గురవుతూనే ఉంటాం. ఈ దిగులు, నిరాశ వల్ల మన మనస్సు ప్రశాంతంగా ఉండదు. ఎక్కువగా మనం ఒంటరి తనాన్ని కోరుకుంటాం. అందరితో కలిసి ఉండలేము. మన అందరి జీవితాల్లో ఇలాంటి సమయాలు వస్తూనే ఉంటాయి, కానీ వాటిని ఏ విధంగా దాటాలి అనేది మనకి తెలిసి ఉండాలి. మన శరీరంలో ఉండే హార్మోన్లు కొన్ని సమయాల్లో సెరోటోనిన్ స్థాయిలను పెంచడం వలన, మనకు నిద్ర సరిగ్గా లేకపోవడం, అనారోగ్యం కలిగించే శరీరతత్వం ఉండటం వంటి లక్షణాలను కలిగిస్తాయి. కేవలం మన హార్మోన్ల వలన మాత్రమే కాదు, మన మానసిక స్థితి కూడా దీనికి కారణం అవుతుంది. మన శరీర సమతుల్యత దెబ్బతినకుండా ఉండటానికి ప్రతి రోజు సూర్యరశ్మిలో తిరుగుతూ ఉండాలి.

ఈ సమస్యను నివారించడానికి మనం మన రోజువారి దినచర్యలో వ్యాయామాల కొరకు 15 నుండి 20 నిముషాల సమయాన్ని వెచ్చించాలి. మన శరీరం ఫిట్ గా ఉండటానికి మరియు పలు రకాల జీవనశైలి రుగ్మతలను నివారించడానికి వ్యాయామం చాల బాగా సహాయ పడుతుందని మనకు తెలుసు. అదే విధంగా వ్యాయామం మన మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో కూడా సహాయపడుతుంది. ప్రతి రోజు వ్యాయామం చేయడం వలన మన శరీరంలో సంతోషకరమైన హార్మోన్లను పెంచి, మన మానసిక స్థితిని మెరుగుపరుస్తుందని నిపుణులు అంటున్నారు.

చురుకైన నడక: నడక మన ఆరోగ్యానికి చాలా మంచిది. నడక అనేది కొత్తగా ప్రారంభించేవారికి, విరామం తర్వాత లేదా ఏదైనా గాయం తర్వాత చేసే ప్రాధమిక వ్యాయామం. ప్రతి రోజు 30 నిముషాలు నడవటం వలన, మన శారీరక మరియు మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది.

ఇది కూడా చదవండి..

మలబద్ధకం పోవాలంటే ఇలాంటి ఆహారం తినండి..

రన్నింగ్: 2-3 సార్లుగా వారానికి 20 నుండి 30 నిముషాలు చేస్తే ఇది మన ఆరోగ్యాన్ని చక్కగా బాగుచేస్తుంది. రన్నింగ్ చేయడం అనేది మానసిక స్థితిమి మెరుగు పరచడమే కాకుండా హృదయ, ఎముకుల ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తాయి.

యోగా: వారానికి 2-3 రోజులు యోగా చేయడం మంచి అలవాటు ఇది, మొత్తం శారీరక బలాన్ని పెంపొందించడంలో సహాయపడుతుంది, అదే సమయంలో మన మనస్సును ప్రశాంతంగా ఉంచడంలో సహాయపడుతుంది.

క్రీడలు ఆడటం:స్నేహితులతో, కుటుంబ సభ్యులతో మంచి సమయం గడపడం, ఫుట్‌బాల్, బ్యాడ్మింటన్, క్రికెట్, వాలీబాల్ వంటి మీకు నచ్చిన క్రీడను వారానికి కనీసం 1-2 సార్లు ఒక గంట పాటు ఆడటం వలన మనసు రీఛార్జ్ అవుతుంది.

హైకింగ్: సహజమైన, పచ్చటి పరిసరాలలో చేసే ఏదైనా శారీరక శ్రమ ఖచ్చితంగా మీ మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది. మిమ్మల్ని శారీరకంగా దృఢంగా ఉంచుతుంది.

ఇది కూడా చదవండి..

మలబద్ధకం పోవాలంటే ఇలాంటి ఆహారం తినండి..

Related Topics

yoga Mental Health

Share your comments

Subscribe Magazine