Health & Lifestyle

బంగాళదుంపలు తింటే మధుమేహం వస్తుందా.. నిపుణులు ఏమంటున్నారంటే?

KJ Staff
KJ Staff

ప్రస్తుత కాలంలో మారుతున్న జీవన శైలి ఆధారంగా మన ఆహారంలో కూడా ఎన్నో మార్పులు చోటు చేసుకున్నాయి. ఈ క్రమంలోనే రోజురోజుకు మధుమేహ వ్యాధి బారినపడే వారి సంఖ్య అధికమవుతోంది. ఈ విధంగా మధుమేహ సమస్యతో బాధపడే వారు బంగాళదుంపలను తినకూడదని చెబుతుంటారు. నిజంగానే మధుమేహంతో బాధపడేవారు బంగాళదుంపలను తినకూడదా..? తింటే ఏమవుతుంది అనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.

సాధారణంగా బంగాళాదుంపలను కూరగాయల రారాజు అని పిలుస్తారు. ఇందులో పిండిపదార్థాలు అధిక మొత్తంలో పిండి పదార్థాలు ఉండటం వల్ల మధుమేహులు బంగాళా దుంపలు తినకూడదని చెబుతుంటారు.ఇందులో ఉన్నటువంటి పిండి పదార్థాలు తొందరగా జీర్ణం అయ్యి రక్తంలోని చక్కెర స్థాయిలను పెంచడానికి దోహదపడతాయి. ఈ క్రమంలోనే పెరిగిన చక్కెర స్థాయిలు సాధారణ స్థితికి రావాలి అంటే అధిక సమయం పడుతుంది. అందుకనే మధుమేహంతో బాధపడేవారు బంగాళదుంపలను తినకూడదని నిపుణులు చెబుతున్నారు.

అదేవిధంగా భూమిలో అధిక మొత్తంలో కార్బోహైడ్రేట్ కంటెంట్ ఉండటం వల్ల అధిక గ్లైసెమిక్ సూచికను కలిగి ఉంటాయి. అధిక గ్లైసెమిక్ ఇండెక్స్ ఉంటే రక్తంలో చక్కెర స్థాయిలు అధికంగా ఉంటాయి. అందుకోసమే బంగాళదుంపలను తినకూడదని నిపుణులు చెబుతున్నారు.మధుమేహంతో బాధపడే వారు బంగాళాదుంపలను తినడం వల్ల అవి తొందరగా జీర్ణం అయ్యి మరి మరి ఆహారం తినాలనిపిస్తుంది. ఈ క్రమంలోనే అధిక మొత్తంలో ఆహారం తీసుకోవడం ద్వారా మధుమేహంతో పాటు ఊబకాయ సమస్య కూడా వెంటాడుతుంది.అందుకోసమే మధుమేహంతో బాధపడేవారు బంగాళాదుంపలకు దూరంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.

Share your comments

Subscribe Magazine