Health & Lifestyle

చలి కాలం లో అధిక చాయ్ ,కాఫీ కి బదులుగా ఇవి ప్రయత్నించండి ...

Srikanth B
Srikanth B

చలి కాలం లో చలి తీవ్రత పెరిగే కొద్దీ చాల మంది వేడి వేడి గ ఏదైనా తాగాలని అనుకుంటారు ..అయితే వేడి వేడి పానీయాలు అనగానే మనందరికీ గుర్తుకు వచ్చేది ఛాయ్ ,కాఫీ , చలికి వేడి వేడిగా ఉందని అధికముగా లాకేస్తుంటారు అయితే ఛాయ్ ,కాఫీ అంతే ప్రభావవంతమైన పానీయాలు తీసుకోవాలనుకునే వారికీ ప్రత్యామ్న్యాయం ఇక్కడ వివరించబడ్డాయి . అయితే అతి యే విషయంలో అయినా ప్రమాదమే వైద్యులు హెచ్చరిస్తున్నారు.

అధికంగా టీ, కాఫీలు సేవిస్తే చాలా ఆరోగ్య సమస్యలు వస్తాయని చెబుతున్నారు. టీ, కాఫీల్లో ఉండే కెఫీన్ కు అలవాటు పడితే చాలా డేంజర్ అని అంటున్నారు. కెఫీన్ పై ఎక్కువగా ఆధారపడడం వల్ల డీహైడ్రేషన్, ఎసిడిటీ, పోషకాలను గ్రహించడంలో ఇబ్బంది, నిద్రలేమి, వంటి దుష్ప్రభావాలు ఏర్పడే అవకాశం ఉంది.

టీ, కాఫీలకు బదులుగా ఇవి మేలు

లెమన్ టీ

ఎక్కువ సార్లు టీ, కాఫీలు తాగే అలవాటు ఉన్న వారు వాటికి బదులుగా లెమన్ టీ వైపు మళ్లితే మంచి ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. వేడి నీళ్లల్లో అల్లం, తేనే, నిమ్మరసం కలుపుకుని తాగితే దాన్నే లెమన్ టీ అంటారు. లెమన్ టీ తాగితే జీర్ణక్రియ సజావుగా సాగుతుంది. శీతాకాలంలో వేధించే జలుబు, దగ్గు నుంచి ఉపశమనం లభిస్తుంది. అలాగే కీళ్ల నొప్పులను దూరం చేయడానికి మంచి ఎనర్జీ డ్రింక్ లా ఉపయోగపడుతుంది.

హెర్బల్ టీ

అలాగే చాలా మంది టీ లో రుచి కోసం మసాలా టీను ఇష్టపడతారు. అలాంటి మసాలా టీ బదులుగా మసాల దినుసులు వేసి చేసి హెర్బల్ టీ కు మారితే మంచిది. దాల్చిన చెక్క, తులసి, లవంగం, యాలకులు, అల్లం వేసి నీటిని మరిగించి, అందులో బెల్లం కలుపుకుని తాగితే హెర్బల్ టీ అదిరిపోతుంది.

జనవరి చివరిలో భారత్ లో కి మరో 12 చిరుతలు ...

గోరువెచ్చని నిమ్మరసం

మనలో చాలా మంది ఒక కప్పు టీ లేదా కాఫీతో రోజును ప్రారంభించేవారు చాలా మంది ఉన్నారు. అలాంటి ఉదయాన్ని గ్లాస్ గోరువెచ్చని నీళ్లల్లో నిమ్మరసం వేసుకుని తాగితే జీర్ణక్రియకు చాలా మంది. అలాగే శరీరానికి అవసరమయ్యే విటమిన్ -సీ కూడా అందుతుంది.

కొద్దీ మేర ఛాయ్ మరియు కాఫీ తీసుకోవడం నాడీ వ్యవస్థకు మంచి చేస్తున్నప్పట్టికి అధిక మొత్తం లో తీసుకోవడం వల్ల ఆరోగ్యం చెడిపోయే అవకాశము లేక పోలేదు .

జనవరి చివరిలో భారత్ లో కి మరో 12 చిరుతలు ...

Share your comments

Subscribe Magazine