Health & Lifestyle

ఒత్తిడిని తరిమేసే.. శనగలు.. గుడ్లు!

KJ Staff
KJ Staff

మారుతున్న జీవన గమనంలో సుఖప్రదమైన, ప్రశాంతమైన జీవితాన్ని గడపడం అంటే అదృష్టంగా భావించాలి. ఎందుకంటే ప్రస్తుతం ప్రతి వ్యక్తి ఉరుకులు పరుగుల జీవితాన్ని గడుపుతూ ఎంతో మానసికవేదన అనుభవిస్తూ ఎన్నో శారీరక, మానసిక సమస్యలతో బాధపడుతూ చిన్న వయసులోనే గుండెజబ్బులు, బీపీ, మధుమేహం, కీళ్ల నొప్పులు వంటి ప్రమాదకర వ్యాధులతో నిత్యం పోరాటం చేయవలసి వస్తోంది.

నిత్యం మనం శారీరక మానసిక ఆరోగ్యంతో ఉండాలంటే ఒత్తిడిని అదిగమనించిన అప్పుడే అది సాధ్యమవుతుంది. కొన్ని రకాల ఆహార పదార్ధాలను నిత్యం ఆహారంలో తీసుకోవడం వల్ల ఒత్తిడి ద్వారా వచ్చే అలసటను అధిగమించవచ్చు.గుడ్లలో చోలిన్‌ అనే పోషకం పుష్కలంగా ఉంటుంది. ఇది మెదడు ఆరోగ్యంగా ఉండేందుకు తోడ్పడుతోందని, అలాగే ఒత్తిడి నివారణకు సమర్థవంతంగా పనిచేస్తుంది కావున ప్రతి రోజు ఒక గుడ్డు తినడం మంచిదే.

చిలగడ దుంపలో ఒత్తిడికి కారణమయ్యే కార్టిసోల్‌ హార్మోన్‌ స్థాయిలను తగ్గించే గుణం ఉంది. దీన్ని కూడా వారానికి రెండు మూడు సార్లు ఆహారంగా తీసుకోవచ్చు. శనగల్లో ఎల్‌ట్రిప్టోపాన్‌ ఎక్కువగానే ఉంటుంది. ఇవన్నీ మనిషిని ఉల్లాసంగా ఉంచడంతోపాటు ఒత్తిడి తగ్గేందుకు దోహదం చేస్తాయి కావున ప్రతి రోజూ శెనగలను నాన పెట్టుకొని తినడం వల్ల ఉపయోగం ఉంటుంది. అలాగే కొంత శారీరక శ్రమ కలిగి వ్యాయామం చేయడం వల్ల సుఖప్రదమైన నిద్ర కలిగి మానసిక ఒత్తిడి దూరమవుతుంది.

Share your comments

Subscribe Magazine