News

తెలంగాణలో గ్రామీణ ప్రాంతాల్లో 19,472 క్రీడా మైదానాలు

Srikanth B
Srikanth B


గ్రామాభివృద్ధిలో భాగంగా ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కార్యక్రమానికి సీఎం శ్రీకారం చుట్టారు. ఒక్కో క్రీడా మైదానానికి ప్రతి గ్రామంలో కనీసం ఒక ఎకరం భూమిని కేటాయించారు.

హైదరాబాద్: గ్రామీణ ప్రాంతాల్లో క్రీడలు, ఆటలను ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం 19,472 క్రీడా మైదానాలను ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. దాదాపు 13,418 మైదానాలకు అనువైన స్థలాలు గుర్తించబడ్డాయి. వీటిలో 10,451 గ్రామ పంచాయతీల్లో రానున్నాయి.

5,602 క్రీడా మైదానం పనులు పూర్తి కాగా, 7,787 పురోగతిలో ఉన్నాయి, మిగిలినవి వివిధ దశల్లో ఉన్నాయి. విద్యార్థులు, యువకులు ఆరోగ్యంగా ఉండడమే కాకుండా వివిధ క్రీడాంశాల్లో రాణించేందుకు ఈ క్రీడా మైదానాలు దోహదపడతాయని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అభిప్రాయపడ్డారు. తెలంగాణ నుంచి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో అత్యుత్తమ క్రీడాకారులను తయారు చేసేందుకు క్రీడా మైదానాలు దోహదపడతాయని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది.

నాలుగు కొత్త తెగలు ST (Schedule Tribe ) గ గుర్తింపు, ఆ తెగలు ఏంటో తెలుసా !

గ్రామాభివృద్ధిలో భాగంగా ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కార్యక్రమానికి సీఎం శ్రీకారం చుట్టారు. ఒక్కో క్రీడా మైదానానికి ప్రతి గ్రామంలో కనీసం ఒక ఎకరం భూమిని కేటాయించారు. ఖో ఖో, కబడ్డీ, వాలీబాల్, లాంగ్ జంప్ తదితర ఆటల కోసం సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నారు.

నాలుగు కొత్త తెగలు ST (Schedule Tribe ) గ గుర్తింపు, ఆ తెగలు ఏంటో తెలుసా !

Share your comments

Subscribe Magazine