News

7th pay commission:పెరగనున్న ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు!

S Vinay
S Vinay

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఈ నెలాఖరులోగా డియర్నెస్ అలవెన్స్ గణనీయంగా పెంచనున్నారు.దీనికి సంబంధించి పూర్తి వివరాలు చదవండి.

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త, వారి డియర్నెస్ అలవెన్స్ త్వరలోనే ప్రభుత్వం పెంచనుంది.7th పే కమీషన్ ప్రకారం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల డీఏను ఏడాదికి రెండుసార్లు సవరిస్తారు. ఇది మొదటగా సంవత్సరం ప్రారంభంలో ఒకసారి మరియు సంవత్సరం మధ్యలో మరొకసారి ప్రకటించబడుతుంది.కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ డియర్‌నెస్ అలవెన్స్ (DA) పెంపుదల జూలై 1 నుండి అమలులోకి రానున్నట్లు సమాచారం.

ప్రతి సంవత్సరం కేంద్రప్రభుత్వ ఉద్యోగుల వేతనాలను నిర్ణయించే లక్ష్యంతో కొత్త నియమం అమలులోకి వచ్చే అవకాశం ఉందని, అయితే ఈ విషయంపై ప్రభుత్వం నుంచి ఎలాంటి ధ్రువీకరణ లేదు. 7th పే కమీషన్ నుండి వేరుగా వేతనాలను పెంచే ఫార్ములాను పరిశీలించాల్సిన సమయం ఆసన్నమైందని వర్గాలు నివేదించాయి.


కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డియర్నెస్ అలవెన్స్ (DA) 38 శాతం ఉంటుంది.అయితే మార్చిలో విడుదలైన ఆల్ ఇండియా కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ (AICPI) ఆధారంగా జూలై-ఆగస్టుకు DAలో 4% పెంపుదల ప్రకటించబడింది. అంటే అంటే మొత్తం డియర్నెస్ అలవెన్స్ 38 శాతానికి చేరుకోనుంది.

AICP ఇండెక్స్ 2022 మొదటి రెండు నెలల జనవరి మరియు ఫిబ్రవరిలో పడిపోయింది. జనవరిలో 125.1 నుండి ఫిబ్రవరిలో 125కి, ఆ తర్వాత మార్చిలో 126కి, 1 పాయింట్ పెరుగుదల. ఏప్రిల్, మే, జూన్‌ల ఏఐసీపీ నంబర్లు ఇంకా విడుదల కాలేదు. ఇండెక్స్ 126 కంటే ఎక్కువ పెరిగితే, ప్రభుత్వం 4% DA పెంచవచ్చు.4 శాతం పెంపుతో డీఏ 34 శాతం నుంచి 38 శాతానికి పెరుగుతుంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు పొందే బేసిక్ వేతనాలపై వీటి పెంపుదల దీని ప్రభావం చూపుతుంది.

మరిన్ని చదవండి.

IAF Recruitment 2022:ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో తాజా ఖాళీలు...ఇంటర్ పాసైతే చాలు!

ఇ-కామర్స్ వెబ్‌సైట్లలో నకిలీ రివ్యూలను తనిఖీ చేయనున్న కేంద్రం!

Share your comments

Subscribe Magazine