News

AP CURFEW: సాయంత్రం 6 గంటల వరకు సడలింపు

KJ Staff
KJ Staff
ap curfew
ap curfew

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కర్ఫ్యూ నిబంధనలను సండలించింది. కరోనా కేసులు తగ్గుతున్న క్రమంలో కర్ఫ్యూ నుంచి సడలింపులు ఇచ్చింది. ప్రస్తుతం ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు కర్ఫ్యూ నుంచి సడలింపులు ఉన్నాయి. అయితే రాష్ట్రంలో కరోనా కేసులు భారీగా తగ్గుతున్న క్రమంలో కర్ఫ్యూ మినహాయింపు సమయాన్ని పెంచింది.

కర్ప్యూ సడలింపు సమయాన్ని సాయంత్రం 6 గంటల వరకు పెంచింది. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కర్ఫ్యూ నుంచి మినహాయింపు ఇస్తున్నట్లు ప్రభుత్వం ఇవాళ వెల్లడించింది. సాయంత్రం 6 గంటల నుంచి మరసటి రోజు ఉదయం 6 గంటల వరకు కర్ప్యూ అమల్లో ఉంటుందని ప్రకటించింది.

సాయంత్రం 5 గంటలకే దుకాణాలు మూసివేయాలని ఆదేశించింది. ప్రభుత్వ కార్యాలయాలు యధావిధిగా పనిచేస్తాయని ప్రభుత్వం తెలిపింది. ఈ నెల 21 నుంచి 30 వరకు ఈ కొత్త గైడ్ లైన్స్ అమల్లో ఉండనున్నాయి. అయితే కరోనా కేసులు ఎక్కువగా ఉన్న తూర్పుగోదావరి జిల్లాల్లో ఇంతకుముందు నిబంధనలే అమల్లో ఉండనున్నాయి.

ఆ జిల్లాలో మధ్యాహ్నం 2 గంటల వరకే సడలింపు అమల్లో ఉండనుంది. ఈ మేరకు జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు చర్యలు తీసుకోవాలని, కర్ఫ్యూను పటిష్టంగా అమలు చేయాలని సీఎం వైఎస్ జగన్ ఆదేశించారు. కరోనా పరిస్థితులపై ఇవాళ సీఎం వైఎస్ జగన్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. అనంతరం ఈ కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

కర్ఫ్యూ నిబంధనలు సడలించిన క్రమంలో ప్రజలు కోవిడ్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని, మాస్కులు ధరించాలని అధికారులు స్పష్టం చేశారు. దుకాణాలు, మార్కెట్లు దగ్గర భౌతికదూరం పాటించాలని సూచించారు. ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తీసుకుంటామన్నారు. మాస్కులు లేకుండా బయటికి వచ్చిన వారిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు.

Share your comments

Subscribe Magazine