News

AP ELECTRICITY CHARGES:సామాన్యులపై మరొక భారం పెరిగిన విద్యుత్ చార్జీలు

S Vinay
S Vinay

AP ELECTRICITY CHARGES: రాష్ట్రంలో విద్యుత్ చార్జీలు పెంచాలని డిస్కమ్లు ప్రతిపాదన తెలిపిన విషయమే దీనిని పరిశీలించిన (andhra pradesh electricity regulatory commission) రాష్ట్ర విద్యుత్‌ నియంత్రణ మండలి తాజాగా విద్యుత్ చార్జీలను పెంచింది.

ఒక వైపు పెరిగిన పెట్రోల్‌, డీజిల్‌ మరియు ఇతర నిత్యావసర వస్తువుల ధరలతో సామాన్య ప్రజలు అల్లాడిపోతున్న వేళ సామాన్యులపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరొక భారాన్ని మోపింది.

పెరిగిన విద్యుత్ చార్జీలు వివరాలు తెలుసుకోండి

30 యూనిట్ల వరకు యూనిట్‌కు 45 పైసలు పెంపు

31-75 యూనిట్ల వరకు యూనిట్‌కు 91 పైసలు పెంపు

76-125 యూనిట్ల వరకు యూనిట్‌కు రూ.1.40 పెంపు

126-225 యూనిట్ల వరకు యూనిట్‌కు రూ.1.57 పెంపు

226-400 యూనిట్లకు రూ.1.16 పైసలు పెంపు

400 యూనిట్లు దాటితే యూనిట్‌కు 55 పైసలు పెంపు

ఈ సందర్భంగా తిరుపతిలో విద్యుత్ చార్జీల టారిఫ్‌ను APERC చైర్మన్ జస్టిస్ సీవీ నాగార్జున రెడ్డి విడుదల చేశారు. 2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి విద్యుత్ చార్జీల ఉత్తర్వులను విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రజలపై విద్యుత్ ధరల పెంపు బాధగా ఉన్నప్పటికి తప్పడం లేదంటున్నారు కేటగిరీలను రద్దు చేసి 6 స్లాబ్‌లను తీసుకొచ్చినట్లు తెలిపారు. విద్యుత్ సంస్థల మనుగడ గురించి అలోచించి తప్పని పరిస్థితుల్లో విద్యుత్ చార్జీలు పెంచాల్సి వచ్చిందన్నారు. దాదాపు 20 ఏళ్ల తరువాత విద్యుత్‌ ఉత్పత్తి ఖర్చు పెరిగి పోవడంతోనే చార్జీలు పెంచి వినియోగదారులపై భారం మోపాల్సి వచ్చిందని APERC చైర్మన్ జస్టిస్ నాగార్జున రెడ్డి తెలిపారు.

మరిన్ని చదవండి

TELANGANA:పొలానికి దిష్టి ఇలా కూడా తీస్తారా ఈ రైతు ఏం చేసాడో చూడండి.

Share your comments

Subscribe Magazine