News

వ్యవసాయ కోటా కింద తిరస్కరించబడ్డ 4,000 నకిలీ దరఖాస్తులు!

Sriya Patnala
Sriya Patnala
approx 4000 applications rejected after claiming for Agriculture Kota
approx 4000 applications rejected after claiming for Agriculture Kota

B. Sc అగ్రికల్చర్ డిగ్రీ లో ప్రవేశాల కోసం వ్యవసాయ కోటా కింద 18,650 విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా,వాటిలో కేవలం 14,190 మాత్రమే రైతుల పిల్లలకు కేటాయించిన సీట్లకు అర్హులుగా గుర్తించబడ్డాయి.

ఈ ఏడాది అగ్రికల్చర్ కోటా కింద బీఎస్సీ అగ్రికల్చర్ సీట్లకు దరఖాస్తు చేసుకున్న వారిలో 4,000 మందికి పైగా విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ప్రైవేట్ సంస్థలలో ఉద్యోగం చేస్తున్నట్టు , అలాగే కొందరు అవసరమైన పత్రాలు అందించడంలో విఫలమవ్వడం ,లేదా నకిలీ పత్రాలను సమర్పించినట్టు అధికారులు గుర్తించారు .

అగ్రికల్చర్ కోటా కింద 18,650 మంది దరఖాస్తు చేసుకోగా 14,190 మంది మాత్రమే రైతుల పిల్లలకు కేటాయించిన సీట్లకు అర్హులుగా గుర్తించారు. డాక్యుమెంట్ వెరిఫికేషన్ ప్రకియ సమయంలో నకిలీ రికార్డులు సమర్పించినట్లు తేలినందున పలువురు విద్యార్థులని తిరస్కరించారు.

కర్ణాటక ఎగ్జామినేషన్స్ అథారిటీ (కెఇఎ) ఇచ్చిన వివరాల ప్రకారం వ్యవసాయ కోటా క్లెయిమ్ చేస్తూ అప్పికేషన్ లు పెట్టిన 4,460 మంది విద్యార్థుల దరఖాస్తులు తిరస్కరించబడ్డాయి. “వారి తల్లిదండ్రులు నగరాల్లోని ప్రైవేట్ కంపెనీలలో పని చేస్తూ బాగా సంపాదిస్తున్నప్పటికీ, అభ్యర్థులు వ్యవసాయ కోట లో దరఖాస్తు చేసుకున్నారు. కానీ దానిని నిరూపించడానికి అవసరమైన సర్టిఫికేట్‌లను సమర్పించడంలో విఫలమయ్యారు, ”అని KEA యొక్క అధికారి తెలిపారు .మరింత ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే వీరిలో పెద్ద వ్యాపారవేత్తల పిల్లలు కూడా ఉన్నారట.ఎక్కడో ఊరిలో ఫామ్‌హౌస్ లేదా కొంచం భూమి ఉన్నంత మాత్రాన రైతుల కోట లో దరకాస్తు చేయడానికి అర్హులు కాదు, అసలు వారిలో కొందరికి వ్యవసాయ నేపథ్యం తో సంబంధమే లేదని తేలింది అని అధికారులు తెలిపారు.

ఇది కూడా చదవండి

ప్రజలు జాగ్రత్త! ఇంటర్నెట్‌లో నకిలీ ప్రభుత్వ పథకం ద్వారా ప్రజల ఖాతాలను ఖాళీ చేస్తున్న మోసగాళ్లు

Share your comments

Subscribe Magazine