News

రైతులకు గమనిక.. ఆ పథకానికి బయోమెట్రిక్ తప్పనిసరి

KJ Staff
KJ Staff

రైతుల కోసం ఏపీ ప్రభుత్వం అనేక పథకాలు ప్రవేశపెడుతోంది. రైతు భరోసా ద్వారా ఏడాదికి రూ.13,500 ఇస్తున్న ప్రభుత్వం.. రైతుల కోసం ఉచిత పంట బీమా పథకం అమలు చేస్తోంది. ఆకాల వర్షాలు, తుఫాన్‌ల వల్ల పంట నష్టపోయిన సమయంలో రైతులను ఆదుకునేందుకు ఈ పథకం ప్రవేశపెట్టింది. వాతావరణ పరిస్థితుల వల్ల రైతులు పంట నష్టపోతే.. ఆ నష్టాన్ని అంచనా వేసి ప్రభుత్వం ఆర్థిక పరిహారం అందిస్తుంది.

ఈ పథకం పూర్తిగా ఉచితం. రైతుల బీమా ప్రీమియం కూడా ప్రభుత్వమే చెల్లిస్తుంది. రాష్ట్రంలోని కోటి 14 లక్ష ఎకరాలను ప్రభుత్వం బీమా పరిధిలోకి తెచ్చింది. రైతు భరోసా కేంద్రాల్లోని ఈ క్రాపింగ్ డేటా ఆధారంగా పంట నష్టం వివరాలను ప్రభుత్వం తెలుసుకుని పరిహారం అందిస్తుంది.

అయితే తాజాగా పంట బీమా పథకంకి సంబంధించి ప్రభుత్వం ఒక కొత్త నిబంధన పెట్టింది. పంట బీమా పథకం వర్తింపుకు రైతుల వేలిముద్రల నమోదు తప్పనిసరి అయింది. ఈ క్రాఫ్ లో నమోదైన రైతులు.. రైతు భరోసా కేంద్రాలకు వెళ్లి బయోమెట్రిక్ పూర్తి చేయాలని ప్రభుత్వం తెలిపింది.

ఇందుకు గాను రైతులు ఆధార్ కార్టు తీసుకెళ్లాలి. బయోమెట్రిక్ పూర్తయితేనే రైతులకు పంట బీమా పరిహారం అందుతుంది. బుధ, శని, ఆదివారాల్లో రైతు భరోసా కేంద్రాల్లో అధికారులు బయోమెట్రిక్ నమెదు చేస్తున్నారు. రైతులు తప్పనిసరిగా ఇది చేయించుకోవాలని , అప్పుడే పంట బీమా వర్తిస్తుందని అధికారులు సూచిస్తున్నారు.


ప్రస్తుతం ఖరీఫ్‌లో సాగు చేసిన వరి, అరటి, మిరప, కందులు, చెరుకు, పసుపుతో పాటు మినుములు, పెసలు, మొక్కజోన్న, వేరుశెనగ, పత్తి పంటలకు బీమా వర్తింపచేస్తున్నారు.

Share your comments

Subscribe Magazine