News

వినియోగదారులకు నాణ్యత లేని ప్రెజర్ కుక్కర్‌ల అమ్మకం .. Flipkart కు 1 లక్ష జరిమానా..

Srikanth B
Srikanth B

తప్పనిసరిగా పాటించాల్సిన నాణ్యత ప్రమాణాలను ఉల్లంఘించిన దేశీయ ప్రెషర్ కుక్కర్‌లను విక్రయించడానికి అనుమతించినందుకు ఈ-కామర్స్ బజారు ‘ఫ్లిప్‌కార్ట్’ కు వినియోగదారుల హక్కుల ఉల్లంఘనపై సెంట్రల్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ జరిమానా ఉత్తర్వులు జారీ చేసింది.

చీఫ్ కమీషనర్ శ్రీమతి నిధి ఖరే నేతృత్వంలో, సి సి పి ఎ ఫ్లిప్‌కార్ట్ తన ప్లాట్‌ఫారమ్‌లో విక్రయించిన మొత్తం 598 ప్రెషర్ కుక్కర్‌ల గురించి వినియోగదారులకు తెలియజేయాలని, ప్రెషర్ కుక్కర్‌లను వెనక్కి తీసుకోవాలని వినియోగదారులకు డబ్బు తిరిగి చెల్లించాలని , 45 రోజులలోపు తమకు పూర్తి నివేదికను సమర్పించాలని ఫ్లిప్‌కార్ట్‌ని ఆదేశించింది. ఈ-కామర్స్ ప్లాట్‌ఫారమ్‌లో అటువంటి ప్రెషర్ కుక్కర్‌లను విక్రయించడానికి అనుమతించినందుకు మరియు వినియోగదారుల హక్కులను ఉల్లంఘించినందుకు ₹1,00,000 జరిమానా చెల్లించాలని కంపెనీని ఆదేశించింది.

స్వాతంత్ర దినోత్సవం రోజున TSRTC యొక్క 'ట్రావెల్ యాజ్ యు లైక్ టికెట్' హిట్ ..

ఫ్లిప్‌కార్ట్ తన ఇ-కామర్స్ ప్లాట్‌ఫారమ్‌లో ఇటువంటి ప్రెషర్ కుక్కర్‌లను విక్రయించడం ద్వారా మొత్తం ₹1,84,263 ఆదాయం సంపాదించిందని అంగీకరించింది. అటువంటి ప్రెషర్ కుక్కర్ల అమ్మకం ద్వారా ఫ్లిప్‌కార్ట్ వాణిజ్యపరంగా లాభపడినప్పుడు, వినియోగదారులకు వాటి విక్రయం వల్ల ఉత్పన్నమయ్యే ప్రభావం మరియు బాధ్యత నుండి అది తనను తాను దూరం చేసుకోలేదని సి సి పి ఎ తెలిపింది.

స్వాతంత్ర దినోత్సవం రోజున TSRTC యొక్క 'ట్రావెల్ యాజ్ యు లైక్ టికెట్' హిట్ ..

Related Topics

Consumer court 1 lakh fine

Share your comments

Subscribe Magazine