News

మామిడి ఎగుమతులపై కరోనా ఎఫెక్ట్

KJ Staff
KJ Staff

మామిడి కాయలకు దేశవ్యాప్తంగా డిమాండ్ ఉంది. మామిడి కాయలను తినేందుకు మామిడి ప్రియులు తెగ ఇష్టపడతారు. మంచి రుచితో పాటు ఎన్నో పోషకాలను మామిడి కాయ తినడం ద్వారా పొందవచ్చు. అందుకే చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు ప్రతిఒక్కరూ మామిడిని తినేందుకు ఇష్టపడుతూ ఉంటారు. ప్రపంచవ్యాప్తంగా మామిడి కాయలు అనేక ప్రాంతాల్లో బాగా పడుతూ ఉంటాయి. మామిడి పంట ద్వారా రైతులు లాభాలు పొందుతున్నారు.

అలాగే ఏపీలో పండే మామిడికి ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ ఉంది. ఏపీ నుంచి విదేశాలకు మామిడి కాయలు ఎగుమతి అవుతున్నాయి. రుచికరమైన ఆంధ్రా మామిడికి దేశవ్యాప్తంగా డిమాండ్ ఉంది. దీంతో ఎగుమతులు భారీగా జరుగుతున్నాయి. అమెరికా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, లండన్, యూరప్, సింగపూర్, ఒమన్ దేశాలకు ఇప్పటివరకు ఆంధ్రా మామిడి ఎగుమతి అవుతోంది. విమానాల ద్వారా విదేశాలకు ఎగుమతి అవుతోంది.

అయితే తాజాగా తొలిసారిగా దక్షిణకొరియాకు ఆంధ్రా మామిడి ఎగుమతి అవుతోంది. విజయవాడ నుంచి విమానాల ద్వారా సౌదీ అరేబియాకు పంపిస్తున్నారు. అక్కడి నుంచి నౌకల ద్వారా దక్షిణ కొరియాకు పంపిస్తున్నారు. న్యూజిలాండ్, సింగపూర్, ఒమన్ దేశాలకు 70 టన్నులకు పైగా మామిడి ఎగుమతి అవుతోంది. ఇక అమెరికా, ఆస్ట్రేలియా, లంఢన్, యూరప్ నుంచి కనీసం 500 టన్నుల ఆర్ఢర్స్ వస్తున్నాయి.

ఇక కిసాన్ రైళ్ల ద్వారా ఆంధ్రా నుంచి వివిధ రాష్ఠ్రాలకు మామిడి రవాణా అవుతోంది. రాష్ఠ్రంలో ఈ ఏాది 3,76,495 హెక్టార్లలో మామిడి సాగవుతుండగా.. ఈ ఏడాది 56.47 లక్షల టన్నుల మామిడి దిగుబడులు వస్తాయని అధికారులు అంచనా వేస్తున్నారు. గత ఏడాది లాగే ఈ సారి కూడా కరోనా ప్రభావం తగ్గకపోవడం వల్ల అమెరికా, ఆస్ట్రేలియాతో పాటు కొన్ని దేశాలు విమాన సర్వీసులను నిలిపివేశాయి. దీంతో ఎగమతికి ఇబ్బందిగా మారింది. మరికొద్ది నెలల్లో పరిస్థితి చక్కబడుతుందని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

Related Topics

mango, andhra, abroad,

Share your comments

Subscribe Magazine