News

పత్తి ధర తగ్గడం తో పత్తిని ఇంట్లో నిల్వ చేస్తున్న రైతులు ...

Srikanth B
Srikanth B
cotton price fall
cotton price fall


గత సంవత్సరం రూ . 8000 నుంచి రూ . 8500 వరకు పలికిన పత్తి ధర ఈ సంవత్సరం రూ . 5000 నుంచి గరిష్టంగా రూ . 6500 వరకు పలికింది దళారులు కుమ్మకై ధరలను అమాంతం తగ్గించేశారు దీనితో రైతులు పెట్టిన పెట్టుబడులు రాక రాష్ట్రవ్యాప్తంగా రైతులు ఆందోళనలు చేసారు అయినా ప్రయోజనం లేకుండా పోయింది ఇప్పుడిపుడే కాస్త ధరలు పెరిగి రైతులకు ఊరట లభిస్తుంది కాస్త ధర పెరగడం తో రైతులు ఒకేసారి మార్కెట్టుకు తీసుకురావడం తో ధరలు మళ్ళి పడిపోయాయి .

పత్తి ధరలు నిలకడగా ఉండక పోవడంతో ఎట్టకేలకు ధరలు పెరుగుతాయనే ఆశతో పలువురు రైతులు పండించిన పంటను నిల్వ చేసుకుంటున్నారు. దీంతోవరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌కు వచ్చే పత్తి పరిమాణం కూడా బాగా తగ్గిపోయింది.

కొందరు రైతులు అయితే ధరలు సరిగ్గా లేకపోవడంతో పెట్టిన పెట్టుబడి రాదని తన పంటను తక్కువ ధరకు అమ్ముకోకుండా ఉండేందుకు వరంగల్ జిల్లాలో ఓ మహిళ తన నివాసంలో పత్తిని నిల్వ చేసింది జనగాం జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్‌ మండలానికి చెందిన రాజు అనే రైతు 30 బస్తాల పత్తిని మార్కెట్‌లో విక్రయించేందుకు తీసుకొచ్చాడు అయితే మార్కెట్లో వ్యాపారాలు చెప్పిన ధర చూసి అమ్మడం కంటే తిరిగి వెనక్కి తీసుకు వెళ్లక వేరే పరిస్థితి లేదన్నారు ఆయన .

ఇది కూడా చదవండి .

గుడ్ న్యూస్: గ్రామ మరియు వార్డు 'సచివాలయ' ఉద్యోగులకు ప్రొబేషన్ ఖరారు చేసిన ప్రభుత్వం!

 

మేము పంటలనువాళ్లు చెప్పిన ధరలకు విక్రయిస్తే, మేము మా పెట్టుబడి మొత్తాన్ని కూడా తిరిగి పొందలేము. ఇప్పుడు పంటను మా ఇళ్లలో నిల్వ చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అనేక కీటకాలు నిరంతరం పంటను దెబ్బతీస్తున్నాయి. ఇది చర్మ సమస్యలకు దారి తీస్తుంది మరియు చాలా మందికి దురద, అలెర్జీ మరియు శ్వాసకోశ సమస్యల లక్షణాలు కనిపిస్తున్నాయి అని రైతు తమ ధీనా గాథ ను వినిపించారు .

ఇది కూడా చదవండి .

గుడ్ న్యూస్: గ్రామ మరియు వార్డు 'సచివాలయ' ఉద్యోగులకు ప్రొబేషన్ ఖరారు చేసిన ప్రభుత్వం!

Share your comments

Subscribe Magazine