News

పంట పొలంలో నీలిరంగు నీళ్లు... భయపడుతున్న రైతులు?

KJ Staff
KJ Staff

సాధారణంగా వ్యవసాయం చేసేటప్పుడు పంట పొలానికి సరైన నీరు అవసరమవుతుంది.అయితే ఈ నీరు కలుషితమైనది అయితే పంట దిగుబడి పూర్తిగా తగ్గి రైతు పూర్తిస్థాయిలో నష్టపోవాల్సి ఉంటుంది. తాజాగా మహారాష్ట్రలోని కల్యాణ్ ప్రాంతంలో గత కొద్ది రోజుల నుంచి పంట పొలాల్లో నీలి రంగు నీళ్లు దర్శనం ఇవ్వడంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.ఈ క్రమంలోనే నీలిరంగు నీరు కేవలం పంటపొలాల్లో మాత్రమే కాకుండా గ్రామాలలో రోడ్లపై కూడా ప్రవహిస్తుండడంతో గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు.

ఈ విధంగా నీరు మొత్తం నీలిరంగులో మారిపోవడానికి కారణం ఈ పరిసర ప్రాంతాలలో రసాయన వ్యర్థ జలాలను భారీ స్థాయిలో విడిచిపెడుతున్నారు. ఈ క్రమంలోనే కళ్యాణ్ ప్రాంతంలో ఉన్నటువంటి 14 గ్రామాలలో పెద్ద ఎత్తున నీరు రంగు మారింది.ఈ విధంగా అధిక మొత్తంలో నీటి కాలుష్యం అవ్వడం వల్ల తమ గ్రామానికి పెద్ద ప్రమాదం పొంచి ఉందని గ్రామస్తులు అందరూ ఎంతో ఆందోళన చెందుతున్నారు.

ఈ క్రమంలోనే గ్రామస్తులు అందరూ కలిసి ఈ విషయాన్ని కాలుష్య నియంత్రణ మండలికి ఫిర్యాదు చేయడంతోపాటు, వెంటనే చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. అయితే గ్రామస్తులు కాలుష్య నియంత్రణ మండలికి ఫిర్యాదు చేసినప్పటికీ అధికారులు ఏమాత్రం చర్యలు తీసుకోకపోవడంతో గ్రామస్తులు పెద్ద ఎత్తున ఆందోళనలు వ్యక్తం చేస్తున్నారు.

Share your comments

Subscribe Magazine