News

గ్యాస్ ధరలు మళ్లీ పెంపు

KJ Staff
KJ Staff
Gas Cylinder rates Increased
Gas Cylinder rates Increased

వంటగ్యాస్ ధరలకు రెక్కలొస్తున్నాయి.  గ్యాస్ బండ ధరలు ఆకాశాన్నంటుతూనే ఉన్నాయి. ఇప్పటికే పెట్రోల్, డీజిల్ ధరలు రోజురోజుకి పెరుగుతుండగా.. ఇప్పుడు వంట గ్యాస్ ధరలు పెరుగుతుండటం సామాన్యులకు భారంగా మారింది. గత నెలలో మూడుసార్లు వంటగ్యాస్ ధరలు పెరగ్గా..  ఈ నెల తొలివారంలోనే వంటగ్యాస్ ధరలు పెంచడం గమనార్హం. దీంతో ఈ నెలలో వంటగ్యాస్ ధరలు మరింత పెరిగే అవకాశముందని వ్యాపార వర్గాలు అంచనా వేస్తున్నాయి.

తాజాగా వంటగ్యాస్‌తో పాటు వాణిజ్య సిలిండర్‌ ధరలను కూడా పెంచుతూ చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. వంటగ్యాస్‌పై రూ.25 పెరగ్గా.. వాణిజ్య సిలిండర్‌పై ఏకంగా రూ.95 పెంచాయి. వెంటనే ఈ ధరలు అమల్లోకి వస్తాయని చమురు సంస్థలు వెల్లడించాయి.

ఇవాళ ధరలు పెంచడంతో.. ఢిల్లీలో వంటగ్యాస్ సిలిండర్ ధర రూ.819కి చేరుకుంది. ఇక వాణిజ్య సిలిండర్ ధర రూ.1614కి చేరుకుంది. గత నెల 4వ తేదీన వంటగ్యాస్ సిలిండర్ ధర రూ.25 పెంచగా.. 15న రూ.50 పెంచారు. ఇక ఈ నెల 25వ తేదీన రూ.50 పెంచారు. ఇప్పుడు మరో రూ.25 పెంచారు.

ఇక గత ఏడాది నుంచి వంటగ్యాస్ ధరలు పెరగడం మొదలైంది. గత ఏడాది డిసెంబర్ 1న రూ.599 నుంచి రూ.644కి పెంచారు. ఆ తర్వాత ఈ ఏడాది జనవరి 1న రూ.644 నుంచి రూ.694కి పెంచారు. ఈ నెల 4న దానికి రూ.719కి పెంచారు. అలా ప్రతి నెలలో పెంచుతూనే ఉన్నారు. రానున్న రోజుల్లో మరింతగా పెరిగే అవకాశముంది. 

Share your comments

Subscribe Magazine