News

అతను కేవలం పరుగెత్తడు, గాలితో పాటు విహరించే వాడు...

KJ Staff
KJ Staff
Milkha Singh
Milkha Singh
అతను ఒక స్ప్రింటర్... కేవలం పరుగులు మాత్రమే తీయడు గాలితో ఉసులాడుతూ విహరిస్తాడు. అతని పరుగు వేగం, గాలి పయనం ఒకే వేగంతో ఉండేది. అందుకే అతన్ని అందరూ ఫ్లయింగ్ సిఖ్ అనేవారు. కానీ ఈ రోజు ఆ వాయు వేగం ఊపిరి ఆగిపోయి క్రీడా ప్రపంచానికే కాదు మొత్తం భారత దేశానికే ఓ తీరని దుఃఖాన్ని మిగిల్చింది.
1935 లో లాయ్యల్ పూర్ లోజన్మించిన ఒక చిన్నపిల్లవాడు తన ప్రాణాలను కాపాడుకోవడానికి పరుగెత్తవలసిన పరిస్తితి వచ్చింది, తనకున్న పరుగు అనే నైపుణ్యంతోనే ఆ ఉగ్రమూకలనుండి తన ప్రాణాలను కాపాడుకోగలిగాడు. భారత-పాకిస్తాన్ విభజన కోసం దాడులు చేసిన వేర్పాటువాద మూకలు వాళ్ళు. ఇప్పుడు ఈ లాయ్యల్ పూర్ పాకిస్తాన్ లో ఉంది. కళ్ళముందు తన తల్లదండ్రుల్ని చంపెస్తుంటే వాళ్ళ ప్రాణాలు కాపాడాలో... తన ప్రాణాలు కాపాడుకోవాలో తెలియని సందిగ్ధం లో ఉన్న ఆ పసి హృదయానికి, వాళ్ళ నాన్న ఆఖరుగా చెప్పిన మాటలు "భాగ్ మిల్కా భాగ్" (పరిగెత్తు మిల్కా పరిగెత్తు)... అప్పుడు ఆ మాటలు విన్న ఆ చిన్న పిల్లవాడు తన పరుగుని ఆరభించాడు. 
ఆ విధంగా పరుగు తీస్తూ ఇండియాలో అడుగుపెట్టిన ఆ బాలుడు ఆర్మీ లో ప్రవేశించాడు. ఆర్మీ తన జీవితాన్ని ఒక మలుపు తిప్పింది. 1951ల నాటి ఒక రోజు రాత్రి అనుకొని ఒక ప్రకటన వచ్చింది, అది ఏమిటంటే ఒక "క్రాస్ కంట్రీ రేస్" జరుగబోతుంది అని, ఆ పోటీలో దాదాపు ఒక 500 మంది వరకు పాల్గొంటారు అని. విషయం తెలిసాక తనని తాను కసరత్తు చేసుకుని పోటీ లో అడుగుపెట్టిన మిల్కా పోటీ ముగిసే సమయానికి కన్నీటిమయం అయ్యాడు ఎందుకో తెలుసా! ఆ పోటీలో వేగంగా పరుగు తీసిన మొదటి పది మందిలో ఆయన ఒకరు. తరువాత ఆర్మిలో హవాల్దారు గా పనిచేస్తున్న గురుదేవ్ గారి సారధ్యంలో 1956 లో మొదటి సారిగా భారత్ కి ప్రాథినిధ్యం వహిస్తూ మెల్బోర్న్ ఒలంపిక్స్ లో అడుగుపెట్టారు మిల్కా. ఆ సమయంలో ఎటువంటి శిక్షణ లేకుండానే ఒలంపిక్స్ వరకు వెళ్ళారు. తరువాత 1958లో ఆసియా క్రీడల్లో 300మీటర్లు, 400 మీటర్ల పరుగపందెంలో బంగారు పతకాలను సాధించారు. అదే సంవత్సరం కామన్వెల్త్ క్రీడల్లో 400 మీటర్ల రేస్ లో బంగారు పథకాన్ని గెలిచారు. అప్పటికి మిల్కా సింగ్ మొదటి భారతీయ క్రీడాకారుడు స్వతంత్ర భారతానికి ప్రాతినిథ్యం వహిస్తు కామన్వెల్త్ క్రీడల్లో బంగారు పతకాన్ని సాధించిన వ్యక్తిగా...
1960 అదొక అయోమయ సమయం మిల్కా సింగ్ కి ఎందుకంటే ఎక్కడనుండి అయితే ప్రాణాలను కాపాడుకోవడానికి పరుగెత్తడం మొదలు పెట్టారో అక్కడ నుండి ఆయనకు ఆహ్వానం అందింది. అవును పాకిస్తాన్ నుండి ఆయనకు ఆహ్వానం అందింది మీరు పాకిస్తాన్ కి రావాలి అని. కానీ ఆయనకు ఏమాత్రం ఇష్టం లేదు అక్కడికి వెళ్ళడం ఎందుకంటే అక్కడే కదా ఆయన తన తల్లదండ్రుల్ని పోగొట్టుకున్నది. తన బాల్యం అంతా వేర్పాటు కల్లోలంతో నిండి పోయింది. మళ్ళీ ఆయనకు ఆ కల్లోల ప్రపంచంలో అడుగుపెట్టదలుచుకోలేదు. అప్పుడు భారత ప్రధాని అయిన జవహర్ లాల్ నెహ్రూ మిల్కా నీ కలిసి ఇలా అన్నారు- సమయం అనేది గాయాలను మాన్పే ప్రయత్నం చేస్తుంది, మీరు పాకిస్తాన్ వెళ్లాల్సిందే, మన రెండు దేశాల మధ్య ఉన్న విభేదాలను ఈ క్రీడలు అనేవి దూరం చేసి సోదర భావాన్ని పెంచుతాయి కాబట్టి మీరు తప్పకుండా వెళ్లాల్సిందే అని చెప్పడంతో మిల్కా సింగ్ పాకిస్తాన్ వెళ్ళి ఒక హోటల్ లో బస చేస్తారు. అప్పుడు ఆయన అక్కడున్న ఒక పాకిస్తాన్ పత్రిక చూడగానే ఒకింత భావోద్వేగానికి గురయ్యారు. అందులో బ్యానర్ న్యూస్ గా " మిల్కా సింగ్ మరియు అబ్దుల్ హాలీద్ మధ్య పోటీ" - " ఇండియా పాకిస్తాన్ ల మధ్య పోటీ" అని. ఇది వాళ్ళు ప్రచురించాల్సినది కాదు నేను వచ్చింది ఉద్దేశ్యం వేరు, వీళ్ళు ఇంక ఆ విద్వేషాల్లోనే ఉన్నారని ఆయన చాలా బాధ పడ్డారు. 
అదొక 400 మి పరుగుపందెం ఆసియాలోని బాగా నిష్ణాతులైన క్రీడాకారులు పాల్గొంటున్నారు. వారిలో అందరికంటే ప్రతిభావంతుడైన "అబ్దుల్ హలీద్" ఒకరు. ఆ రేసులో మిల్కాను చూసిన అందరూ ఈ బక్క పలచని సర్దార్ ఏం పరిగెడతాడు అని అనుకున్నారు. కానీ పోటీ ముగిసే సమయానికి అందరూ ఆశ్చర్య పోయారు. నిజానికి ఆ బక్క పలుచని సర్దార్ పరిగెత్తలేదు గాలితో ఉసులాడుతు రెక్కలు చాచిన పక్షిలా విహరించారు. స్టేడియం లో బుర్ఖాల వెనకున్న వందలాది మహిళలు ఆయన పరుగు చూసి వారి ముసుగులను తొలగించి "ఫ్లయింగ్ సిఖ్" అని గట్టిగా అరవడం మొదలు పెట్టారు. 
విక్టరీ స్టాండ్ దగ్గరికి వచ్చిన "జనేరల్ అయుబ్" మిల్కా మెడలో బంగారు పతకం వేసి, మిల్కా నీ ఉద్దేశించి మాట్లాడుతూ "మిల్కా జీ మీరు పాకిస్తాన్ నుండి పరిగెత్తలేదు, నిజానికి మీరు పాకిస్థాన్ నుండి ఎగిరి పోయారు అని అంటూ "ఫ్లయింగ్ సిఖ్" అని బిరుదును ఇస్తారు. అదే సంవ్సరంలో జరిగిన రోమ్ ఒలంపిక్స్ కి ప్రాతినిథ్యం వహించిన ఒక చిన్న సమయాంతరంలో బంగారు పతకాన్ని కోల్పోయారు.
ఇలా తన జీవితాన్ని రైలు తో పోటీ పడి పరుగులు తీస్తూ గలిలో ఎగరడం నేర్చుకున్న మిల్కా ఈ కరోనా మిగిల్చిన ఆరోగ్య సమస్యలతో తన 91 సంవత్సరాల వయస్సులో మరణించి మనల్ని వదిలి వెళ్లిపోవడం జరిగింది. నిజానికి తన పరుగుతో గాలిని భూమిని ఏకం చేస్తూ విహరించిన ఆ ఫ్లయింగ్ సిఖ్ మనకు అందని దూరాలకు ఎగురుకుంటూ వెళ్ళిపోయారు.

Related Topics

Milkha Singh

Share your comments

Subscribe Magazine