News

ఎండుటాకులతో కంపోస్ట్ తయారీ.

KJ Staff
KJ Staff
Dry Leave Compost
Dry Leave Compost

ప్రస్తుతం చాలామంది ఆర్గానిక్ పదార్థాలతో తమ ఇంట్లో, పొలంలో మొక్కలకు ఎరువు తయారుచేసుకుంటూ ఉంటారు. దీన్ని సహజసిద్ధమైన కంపోస్ట్ గా ఉపయోగిస్తారు చాలామంది.

ఒకవేళ మీరు దీన్ని గతంలో ఎప్పుడూ ఉపయోగించకపోతే దాన్ని తయారుచేసుకోవడం ఎలా ఆలోచిస్తుంటే వెంటనే దాని గురించి సమాచారం తెలుసుకోండి. మీకు మీరే ఆర్గానిక్ ఫర్టిలైజర్ తయారుచేసుకోండి. దీనికి మీకు కావాల్సిందల్లా ఎండిన ఆకులు, రాలిపోయిన పండిపోయిన ఆకులు మాత్రమే. వాటితోనే సులువుగా ఈ ఎరువు తయారుచేసుకోవచ్చు.

దీనికి మొదటి అడుగుగా ఎండిపోయి, పండిపోయి రాలిపోయిన ఆకులన్నింటినీ సేకరించాలి. ఎండాకాలం రాలిపోయిన ఆకులు చాలా తేలికగా ఉంటాయి. వీటన్నింటినీ సేకరించి కాస్త చిన్నగా కత్తిరించి పెట్టుకోవాలి. వీటన్నింటిలో ఒక బిన్ లో వేసుకోవాలి. నీటి తడి తగలకుండా పెద్ద కంటెయినర్ లో వేసి దాచి పెట్టాలి. ఇందులో నైట్రేట్ మెటీరియల్ వేసి ఉంచాలి. ఇలా చేయడం వల్ల ఎండుటాకుల్లో ఎక్కువగా ఉండే కార్బన్ ని ఇది బ్యాలన్స్ చేస్తుంది. నైట్రేట్ చేర్చేందుకు మీ వంట గదిలో ఉన్న వేస్ట్ ని అందులో వేయవచ్చు.

కట్ చేసిన మొక్కల భాగాలను కూడా అందులో చేర్చుకోవచ్చు. ఆ తర్వాత మరో పెద్ద కంటెయినర్ లో ఒక లేయర్ ఆకులు మరో లేయర్ ఈ నత్రజని మెటీరియల్ వేసి పెట్టుకోవాలి. ఆకులు, నైట్రేట్ మెటీరియల్ నిష్పత్తి 5:1గా ఉండేలా చూసుకోవాలి. ఇందులోంచి కాస్త వాసన కూడా వచ్చి ఇబ్బంది పెడుతుంది. అందుకే ఇందులో కొద్దిగా నీటిలో సున్నపు రాయి మిశ్రమాన్ని కలిపి దాన్ని ఈ కంటెయినర్ లో జల్లుకోవాలి. ఇది వాసన తగ్గించడంతో పాటు ఎసిడిటీని తగ్గిస్తుంది. ఇది కొద్ది పొడిపొడిగా అనిపిస్తుంటే లైట్ గా నీళ్లు చల్లుకోవాలి. దీనివల్ల కంపోస్ట్ మెత్తగా ఉండి మంచి ప్రయోజనం అందుతుంది.

ఈ కంపోస్ట్ ఆకులు ఎంత వేగంగా మురిగిపోతాయన్న దానిపై ఆధారపడి ఉంటుంది. దీనికోసం ఆకులతో పాటు గాలి, నీళ్లు రెండూ తగిన మోతాదులో అవసరమవుతాయి. గాలి మన చుట్టూ అందుబాటులో ఉంటుంది. అప్పుడప్పుడూ కొద్దిగా నీళ్లు చిలకరించుకుంటూ దీన్ని తయారుచేసుకోవచ్చు. దీనిలో వాడేందుకు వేస్ట్ వాటర్ ఉపయోగించడం మంచిది. అంటే బట్టలు ఉతికిన తర్వాత మిగిలిన నీళ్లు, కూరగాయలు, గిన్నెలు కడిగిన తర్వాత మిగిలిన నీళ్లు వంటివి ఇందులో వేసేందుకు ఉపయోగించవచ్చు. ఈ ఎండిన ఆకులను కంపోస్ట్ గా తయారుచేసి మొక్కలకు వేయడం వల్ల నేల క్వాలిటీ పెరుగుతుంది. ఇది మొక్కలకు కూడా ఎంతో మంచిది. అంతేకాదు.. ఇలా చేయడం వల్ల చెత్త బయటకు వెళ్లకుండా చూసుకునే వీలు కూడా ఉంటుంది.

ఇలా కాకుండా ఆకులను బాగా ఎండబెట్టి పొడి చేసుకోవాలి. ఇందులో సగాన్ని ఓ బకెట్ లో వేసుకోవాలి. ఇందులో కొద్దిగా పేడను కలిపి పైన కొన్ని చిన్న చిన్న ఆకులు వేసి పెట్టుకోవాలి. దీన్ని ఎనిమిది నుంచి పది రోజుల పాటు పక్కన పెట్టుకోవాలి. మధ్యమధ్యలో కలుపుతూ ఉండాలి. రోజుకోసారి కలపడం మంచిది. ఇది మిశ్రమంలో గాలి చేరేలా చేస్తుంది. ఎనిమిది నుంచి పది రోజుల తర్వాత మిశ్రమం నుంచి నీరు బయటకు వస్తుందంటే అది సిద్ధమైనట్లే ఇప్పుడు అందులో మిగిలిన ఆకుల పొడి, పండ్లు, కూరగాయల తొక్కలు, మిగిలిన ఆహారం వంటివి వేసుకోవచ్చు. దీంతో బకెట్ నిండుగా మారుతుంది. దీనిపై మూత పెట్టి ఉంచుకోవాలి. ఆ తర్వాత ఇదే పద్ధతిని మరో బకెట్ తో పాటించవచ్చు. మూడు వారాలపాటు దీన్ని పక్కన పెట్టడం వల్ల వల్ల కంపోస్ట్ తయారవుతుంది. దీన్ని మొక్కల కోసం ఉపయోగించుకోవచ్చు. ఈ కంపోస్ట్ ని మొక్కల వేర్ల దగ్గర వేసుకోవాలి. మట్టితో కలిపి దాన్ని కుండీల్లో వేసి మొక్కలు నాటేందుకు ఉపయోగించవచ్చు.

https://krishijagran.com/blog/compost-management-and-its-advantages/

https://krishijagran.com/agripedia/make-really-powerful-compost-from-cowdung-cakes-at-home-your-easy-guide-here/

Share your comments

Subscribe Magazine