News

రైతులకు తోడుగా "రైతు నేస్తం"

KJ Staff
KJ Staff

రైతులకోసం, విశిష్టంగా ప్రారంభించిన "రైతు నేస్తం" డిజిటిల్ ప్లాట్ఫార్మ్, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, తెలంగాణ రాష్ట్ర సెక్రటేరియేట్ నుండి బుధవారం ప్రారంభించ్చారు. రైతులు తమ వ్యవసాయంలో ఎదుర్కునే సమస్యలకు, రైతు నేస్తం డిజిటల్ ప్లాట్ఫారం ద్వారా, వ్యవసాయ నిపుణుల నుండి నేరుగా సమాధానాలు తెల్సుకోవచ్చు. వ్యవసాయ పరిజ్ఞానాన్ని రైతుల వద్దకు చేర్చడంలో ఈ డిజిటిల్ ప్లాట్ఫార్మ్, సహాయపడుతుంది.

రైతు నేస్తం డిజిటిల్ ప్లాట్ఫార్మ్ ప్రారంభించిన అనంతరం, సీఎం రేవంత్ రెడ్డి, వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రైతులతో నేరుగా మాట్లాడారు. డిప్యూటీ చీఫ్ మినిస్టర్ మల్లు బట్టి విక్రమార్క, అగ్రికల్చర్ మినిస్టర్ తుమ్మల నాగేశ్వరావు, మరియు ఇతర పార్టీ నేతలు ఈ కార్యకర్మంలో పాల్గొన్నారు. వీడియో కాన్ఫరెన్స్ లో రైతులతో మాట్లాడి, వారి సమస్యలను నేరుగా తెల్సుకున్నారు.

రాష్ట్రంలోని మొత్తం 2,601 రైతు వేదికల్లో రైతు నేస్తం వీడియో కాన్ఫరెన్స్ యూనిట్స్ని నిర్మించారు. ఈ కార్యక్రమానికి మొత్తం 97 కోట్లా రూపాయిలు ఖర్చు చెయ్యబోతున్నారు. ఈ కార్యకర్మాన్ని ఫేసుల వారీగా మొత్తం రాష్ట్రమంతా రైతు నేస్తం యూనిట్స్ ను నిర్మిస్తారు. మొదటి పేస్, 4.07 కోట్ల వ్యయంతో 110 అసెంబ్లీ స్థానాల్లో ఒక్కో యూనిట్ నిర్మించబోతున్నారు.

ఈ రైతు నేస్తం కార్యక్రమంన్ని ప్రతి మంగళవారం మరియు శుక్రవారం నిర్వహిస్తారు. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ స్టేట్ అగ్రికల్చర్ యూనివర్సిటీ మరియు తెలంగాణ వ్యవసాయ డిపార్ట్మెంట్ కలిసికట్టుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. వ్యవసాయ శాస్త్రజ్ఞులు, ప్రొఫెసర్లు, రైతులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడి, వారి సందేహాలను నివృత్తి చేస్తారు. ఈ కార్యక్రమం ద్వారా రైతులకు, వ్యవసాయ పరిశోధనల గురించి, నూతన కార్యాచరణల గురించి సమగ్ర సమాచారం అందించవచ్చు.

Share your comments

Subscribe Magazine